గుకేష్ చెన్నైలో 2006 మే 29న జన్మించాడు. ఇతడు తండ్రి పేరు రజినీకాంత్. చెన్నైలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నారు. తల్లి పద్మ మైక్రో బయాలజిస్ట్. ఏడు సంవత్సరాల వయసు నుంచే గుకేష్ తన చదరంగ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వెళ్ళమ్మాల్ పాఠశాలలో గుకేష్ చదువుతున్నప్పుడు.. అతడికి చదరంగంపై ఉన్న ఆసక్తిని కోచ్ భాస్కర్ గమనించాడు. అప్పటినుంచి అతనిని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడు కావడంతో గుకేష్ కు ఎదురన్నది లేకుండా పోయింది. తక్కువ సమయంలోనే గుకేష్ తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. ఫలితంగా 12 సంవత్సరాల ఏడు నెలల 17 రోజుల వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా ఆవిర్భవించాడు. ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గుకేష్ కు చదరంగం మీద విపరీతమైన ఆసక్తి ఉండడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అతడికి అద్భుతమైన అవకాశాలు కల్పించేందుకు చాలా త్యాగాలు చేశారు. అందువల్లే ఎంతో ఒత్తిడి ఉండే చదరంగంలో గుకేష్ అనితర సాధ్యమైన ఆట తీరును ప్రదర్శించాడు.
ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు
గుకేష్ అమ్మానాన్నల ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా. అయితే వారు ఉద్యోగాల నిమిత్తం చెన్నై వెళ్లారు. అక్కడ స్థిరపడ్డారు. గుకేష్ కూడా అక్కడే జన్మించాడు. గుకేష్ 44వ చెస్ ఒలంపియాడ్ లో స్థిరంగా రాణించాడు. 45వ చెస్ ఒలంపియాడ్ లో డబుల్ గోల్డ్ సాధించాడు.. స్పెయిన్ లో గలిసియా ప్రాంతంలో 2018 లో జరిగిన అండర్ – 12 వరల్డ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు గుకేష్. మాగ్నస్ కార్ల్ సన్ 2022లో వరల్డ్ నెంబర్వన్ ఛాంపియన్ గా నిలవగా.. అతడిని కూడా గుకేష్ ఓడించాడు.
ఈ ఏడాది..
ఈ ఏడాది ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి ని గుకేష్ ఓడించాడు. వారంతా కూడా ఇండియన్ గ్రాండ్ మాస్టర్లు.. వారిని మట్టి కల్పించి క్యాండిడేట్స్ టోర్నీలో గుకేష్ విజేత గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు 37 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ విజయం ద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో పోటీపడి నిజం సాధించాడు.
విశ్వనాథన్ ఆనంద్ ముఖ్య పాత్ర
గుకేష్ ఈ స్థాయిలో విజయం సాధించడంలో విశ్వనాథన్ ఆనంద్ కీ రోల్ ప్లే చేశాడు. మానసిక దృఢత్వం, అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇచ్చాడు. వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో గుకేష్ కు విశ్వనాథన్ ఆనంద్ అనేక సలహాలు ఇచ్చాడు. అందువల్లే గుకేష్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ కంటే ముందు 2017లో అండర్ -9 చెస్ ఛాంపియన్ షిప్, 2018లో ఆసియన్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో ఐదు గోల్డ్ మెడల్స్, 2023లో 2750 ఎఫ్ఐడిఈ రేటింగ్స్ సాధించాడు. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా గుకేష్ ఆవిర్భవించాడు.