Ghani Movie: వరుణ్ తేజ్ అభిమానులకు షాక్… “గని” మూవీ రిలీజ్ వాయిదా

Ghani Movie: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. తొలుత ఈ నెల 24న విడుదల చేయాలని […]

Written By: Raghava Rao Gara, Updated On : July 18, 2023 2:34 pm
Follow us on

Ghani Movie: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. తొలుత ఈ నెల 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే… ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు అని తెలుస్తుంది. పలు కారణాల రీత్యా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Varun Tej Ghani Movie

Also Read: నయీం డైరీ సినిమాకు షాక్​.. స్టే విధించిన తెలంగాణ హైకోర్టు

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో “మా అందరి హృదయాలకు దగ్గరైన సినిమా ‘గని’. ఈ సినిమా నిర్మాణంలో మేం ఎంతో శ్రమించాం. ఖరీదైన సెట్స్ వేయడం దగ్గర నుంచి అందమైన ప్రదేశాలకు వెళ్లి చిత్రీకరణ చేశాం. ప్రేక్షకులకు బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని… ఏ విషయంలోనూ మేం రాజీ పడలేదు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అలాగే, రాబోయే రోజుల్లో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందుకని, పోటీ ఉండకూడదని… అందరికి వసూళ్లపై ప్రభావం పడుతుందని మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో థియేటర్లలో మా సినిమాను విడుదల చేస్తాం” అని పేర్కొన్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అలాగే, థియేటర్లలో మాత్రమే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేసింది మూవీ యూనిట్. ‘గని’ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు గని మూవీ మేకర్స్.


Also Read: ఆటోలో గమనం సినిమా చూసేందుకు థియేటర్​కు వచ్చిన శ్రియ