మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీకవి. మనిషిలో రాక్షసత్వం పెరిగిపోతోంది. మనిషి మనిషిలా కాకుండా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. కర్కశంగా ఎదుటి వారిని చంపుతూ మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. అత్యంత దారుణంగా సాటి వారిని చంపుతున్నాడు. మనిషి మనిషిని చంపుకోవడం మానవత్వం కాదు రాక్షసత్వమని తెలిసినా అతడిలోని రాక్షస గుణం దాగడం లేదు. ఫలితంగా హత్యాకాండలు పెరుగుతున్నరాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. తన భార్యను తల నరికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ దుర్మార్గుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ లోని ఇమాద్ నగర్ లో నివాసముండే పర్వేజ్ తన భార్య సమ్రిన్ ఇద్దరు భార్యా భర్తలు. 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న పర్వేజ్ కు భార్యపై అనుమానం పెరిగింది. దీంతో ఎలాగైనా ఆమెను హత్య చేయాలని భావించాడు.
గతంలోనే సమ్రిన్ తో విడాకులు తీసుకున్న పర్వేజ్ ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అయినా అతడిలో అనుమానమనే పెనుభూతం పోలేదు ఈ నేపథ్యంలో ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. గంజాయి మత్తులో ఉన్న పర్వేజ్ తెల్లవారుజామున నాలుగు గంటలకు భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి కత్తితో తల నరికాడు. అనంతరం తలను వేరు చేసి దాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
పర్వేజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పర్వేజ్ చేసిన పనికి అందరు ఆందోళన చెందుతున్నారు. మనిషిలో ఇంత రాక్షసత్వం దాగి ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కట్టుకున్న భార్యనే కడతేర్చిన దుర్మార్డుడికి శాపనార్థాలు పెడుతున్నారు.