https://oktelugu.com/

Katrina Kaif Marriage: కత్రినా ఎంగేజ్​మెంట్​ రింగ్​, మంగళసూత్రం ఖరీదెంతో తెలిస్తే షాక్​?

Katrina Kaif Marriage: బాలీవుడ్​లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కింది. కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​ పెద్లల సమక్షంలో ఒకటయ్యారు. సెలబ్రిటీ వివాహాలంటే.. అటు సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారు వేసుకున్న డ్రస్​, నగల నుంచి పెళ్లికి పెట్టిన ఖర్చు వరకు అన్నింటిపై ఆరాదీస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కత్రినా నిశ్చితార్తపు ఉంగరం ఖరీదుపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్​లో ఈ విషయంపైనా చర్చ నడుస్తోంది. నీలమణితో చేసిన డైమండ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 05:55 PM IST
    Follow us on

    Katrina Kaif Marriage: బాలీవుడ్​లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కింది. కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​ పెద్లల సమక్షంలో ఒకటయ్యారు. సెలబ్రిటీ వివాహాలంటే.. అటు సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారు వేసుకున్న డ్రస్​, నగల నుంచి పెళ్లికి పెట్టిన ఖర్చు వరకు అన్నింటిపై ఆరాదీస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కత్రినా నిశ్చితార్తపు ఉంగరం ఖరీదుపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్​లో ఈ విషయంపైనా చర్చ నడుస్తోంది. నీలమణితో చేసిన డైమండ్​ రింగ్ విలువ దాదాపు ఏడున్నర లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఇటువంటి ఉంగరం బ్రిటన్​యువరాణి ప్రిన్సెస్​ డయానా ప్రిన్స్ చార్లెస్​తో నిశ్చితార్థం సమయంలో ధరించింది.

    https://twitter.com/KatrinaKaifFB/status/1468996965556002821?s=20

    ఇప్పుడు మళ్లీ కత్రినా అలాంటి రింగ్​ను సొంతం చేసుకుంది. మరోవైపు కత్రిన మెడలో ఉనన నల్లపూసల మంగళసూత్రం విలువ కూడా లక్షల్లో ఖరీదు చేస్తుందని సమాచారం. ఈ నల్లపూసకు చివర్లో రెండు డైమండ్​ డ్రాప్స్​ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంగళసూత్రాన్ని సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించారు.

    Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

    కాగా, వీరి వెడ్డింగ్ ప్రసారహక్కులను అమెజాన్ ప్రైమ్ కొనేందుకు ముందుకొచ్చినట్లు టాక్​ వినిపిస్తోంది. దాదాపు 100కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ డీల్​పై కత్రినా- విక్కీ రియాక్షన్​ తెలియాల్సి ఉంది. వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలో వీరి రిసెప్షన్​ జరగనుంది.

    Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కత్రీనా – విక్కీ పెళ్లి ఫోటోలు…