Rukmini Vasanth Upcoming Movies: సినీ ఇండస్ట్రీ లో ఒక హీరో కి కానీ హీరోయిన్ కి కానీ అదృష్టం అనేది అంత తేలికగా రాదు. టాలెంట్ ఉన్నా లేకపోయినా అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ లో ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్తుంటారు. కానీ కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్స్ గానే మిగిలిపోయారు. అయితే అదృష్టం, టాలెంట్ , అందం ఈ మూడు కలయిక తో ఉన్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రుక్మిణీ వాసంత్(Rukmini Vasanth). ఇప్పటి వరకు ఈమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కన్నడ సినిమా ద్వారానే మన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ‘సప్తసాగరాలు ఎల్లో’ అనే చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు. ఆ సినిమాతోనే ఈమె సౌత్ మొత్తం పాపులారిటీ ని సంపాదించింది.
Also Read: War 2 Movie Rights : వార్ 2 రైట్స్ కోసం పోటీపడుతున్న బడా నిర్మాతలు, ఎంత ఆఫర్ చేస్తున్నారంటే?
ఇప్పుడు ఈమె ఏకంగా వేల కోట్ల వసూళ్లను రాబట్టే ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ అవకాశాలను సంపాదించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే ఈమె ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘డ్రాగన్’ చిత్రం లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్(Rebel Star Prabhas), సందీప్ వంగ(Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ చిత్రం లో కూడా ఈమె హీరోయిన్ గా అంటించబోతుందని టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ చిత్రానికి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది, అదే విద్మగా ‘డ్రాగన్’ చిత్రానికి వెయ్యి కోట్ల గ్రాస్ స్టామినా ఉంది. అలా ఈమె చేతిలో ఇప్పుడు ఏకంగా మూడు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల విలువ చేసే సినిమాలు ఉన్నాయి అన్నమాట. ఇవి రెండు మాత్రమే కాకుండా, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించబోతుందట.
దీనిని బట్టీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో రుక్మిణీ వాసంత్ పేరు మారుమోగబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక పక్క కుర్ర హీరోలు, మరో పక్క పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్, మరో పక్క సీనియర్ హీరోలు, ఇలా ప్రతీ ఒక్కరు ఈమె డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ‘స్పిరిట్’ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా దీపికా పదుకొనే ని ఎంచుకున్నారు.క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలోకి రుక్మిణీ వసంత్ ఎంపికైంది. అంత సూపర్ స్టార్ చేయాల్సిన పాత్ర రుక్మిణీ వాసంత్ చేతికి వెళ్లిందంటే, ఆ క్యారక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.