Aarya 3 Movie Cast and Crew Details: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపడేలా చేసిన చిత్రం ‘ఆర్య’. ఇప్పుడు దేశం మొత్తం ఎంతో గర్విస్తున్న డైరెక్టర్ సుకుమార్(Sukumar) కి ఇది మొదటి సినిమా. ఆరోజుల్లో లవ్ స్టోరీస్ ఈ సినిమా ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్. అల్లు అర్జున్ నటన, పాటలు, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, ఇలా ప్రతీ ఒక్కటి అభిమానులు, ప్రేక్షకులు ఏళ్ళ తరబడి గుర్తు చేసుకునే రేంజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ, ‘ఆర్య 2’ చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్ లో వచ్చిన ఈ సినిమా ఆల్బమ్ ఆరోజుల్లో ఒక సెన్సేషన్. కానీ సినిమా మాత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ‘ఆర్య’ కి ‘ఆర్య 2’ కి కథ పరంగా ఎలాంటి లింక్ లేదు. రెండు డిఫరెంట్ సినిమాలు, కేవలం లీడ్ క్యారెక్టర్స్ పేర్లు ఒక్కటే ‘ఆర్య’ లో ఉన్నవే ఈ చిత్రం లో ఉన్నాయి.
Also Read: Allu Arjun car hits a wall : గోడని గుద్దేసిన అల్లు అర్జున్ కారు..సంచలనం రేపుతున్న వీడియో!
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ‘ఆర్య 3’ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. అల్లు అర్జున్ చూస్తే పాన్ ఇండియా దాటి, పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో లవ్ స్టోరీ చేయడమంటే తన మార్కెట్ ని తానూ తగ్గించుకున్నట్టే అని చాలా మంది విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ ఈ చిత్రం లో హీరో గా నటిస్తున్నది అల్లు అర్జున్ కాదట. నిర్మాత దిల్ రాజు సోదరుడు, శిరీష్ కొడుకు ఆశిష్(Ashish Reddy) నటిస్తాడట. 2022 వ సంవత్సరం లో ‘రౌడీ బాయ్స్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ఆశిష్. చూసేందుకు కుర్రాడు చాలా బాగున్నాడు అనే టాక్ వచ్చింది. సినిమా కూడా పర్వాలేదు యావరేజ్ అనే రేంజ్ లో ఆడింది.
ఈ చిత్రం తర్వాత ఆయన కొంత గ్యాప్ తీసుకొని ‘లవ్ మీ – ఈఫ్ యు డేర్’ అనే చిత్రం చేసాడు. ఇది కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘సెల్ఫిష్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా లవ్ టుడే, సింగిల్ ఫేమ్ ఇవానా నటిస్తుంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ఆశిష్ ‘ఆర్య 3’ ని మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ‘ఆర్య’ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుందని, ‘ఆర్య 2’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా ‘ఆర్య’ పరువు తీసే విధంగా అయితే లేదని, కానీ అల్లు అర్జున్ కాకుండా ఎవ్వరూ ఈ ఫ్రాంచైజ్ కి న్యాయం చేయలేరని. ఆయన కాకుండ వేరే హీరో ఈ ఫ్రాంచైజ్ లో నటిస్తే ‘ఆర్య’ చిత్రం పరువు పోతుందని అంటున్నారు నెటిజెన్స్.