Homeఎంటర్టైన్మెంట్War 2 Movie Rights : వార్ 2 రైట్స్ కోసం పోటీపడుతున్న బడా...

War 2 Movie Rights : వార్ 2 రైట్స్ కోసం పోటీపడుతున్న బడా నిర్మాతలు, ఎంత ఆఫర్ చేస్తున్నారంటే?

War 2 Movie Rights : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 చిత్రాన్ని యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆయన వార్ 2 చిత్రానికి కథ కూడా సమకూర్చడం మరొక విశేషం. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని మే 20న వార్ 2 టీజర్ విడుదల చేశారు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో వార్ 2 టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది.

మాజీ ఇండియన్ ఏజెంట్ కబీర్ ని వెంటాడే ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ సైతం ఫ్యాన్స్ ని అబ్బురపరిచింది. వార్ 2 టీజర్ విడుదల తర్వాత మూవీకి డిమాండ్ మరింత పెరిగింది. ఏపీ-తెలంగాణ హక్కుల కోసం బడా నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఏషియన్ సినిమా ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వార్ 2 హిందీ, తెలుగు రైట్స్ రూ. 90-110 కోట్ల వరకు పలుకుతున్నాయట.

Also Read : ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

రూ. 100 కోట్లకు పైగా ఆఫర్ చేసిన ఏషియన్ సినిమా మిగతా సంస్థల కంటే ముందు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తెలుగు హీరో. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. ఈ కారణంగా వార్ 2 హక్కుల కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ కి సైతం తెలుగు రాష్ట్రాల్లో కొంత మార్కెట్ ఉంది. ఆయన నటించిన క్రిష్, ధూమ్ 2, వార్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్లు రాబట్టాయి. మొత్తంగా వార్ 2 హక్కుల ద్వారా భారీగా లాభపడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు వార్ 2 చిత్రాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

కాగా వార్ 2 వరల్డ్ వైడ్ ఆగస్టు 14న విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ గా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ల మీద తెరకెక్కిన సాంగ్ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణ అనే వాదన వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular