
‘Rudrudu’ first day collections : కమర్షియల్ సినిమాలకు ప్రొమోషన్స్ పెద్దగా అవసరం లేదు, మినిమం గ్యారంటీ గా అనిపించినా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జాతర ఉంటుంది అని విశ్లేషకులు మొదటి నుండి చెప్తూనే ఉన్నారు.ఇది అనేక సందర్భాలలో ప్రూవ్ అవుతూ వచ్చింది, నిన్న కూడా మరోసారి నిరూపణ అయ్యింది.రాఘవ లారెన్స్ హీరో గా నటించిన ‘రుద్రుడు’ అనే సినిమా నేడు తెలుగు మరియు తమిళం బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.
మార్నింగ్ షోస్ నుండే పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడం తో ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి.పెద్దగా ప్రొమోషన్స్ ఏమి చెయ్యకుండా, కేవలం లారెన్స్ పేరు మీద ఇంత మంచి ఓపెనింగ్ వచ్చింది అంటే,మాస్ లో ఆయనకీ ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి కలిపి 7 కోట్ల రూపాయలకు జరిగింది.
మొదటి రోజు మాస్ ప్రాంతాలలో ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.ముఖ్యంగా సీడెడ్, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో మాట్నీ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి.నెల్లూరు, గుంటూరు మరియు కృష్ణ జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి.నైజాం ప్రాంతం లో కూడా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది.అసలు హైప్ లేని సినిమాకి ఇంత ఓపెనింగ్ రావడం అనేది ట్రేడ్ పండితులు సైతం ఊహించలేకపోయారు.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు రెండు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదే ఊపు లో మూడు రోజులు కలెక్షన్స్ రాబడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు.దీనికే ఇంతటి వసూళ్లు వస్తే ఇంకా కాంచన 4 కి ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు.