spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan - Nagababu : నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan – Nagababu : నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan – Nagababu : జనసేన.. జనంతోనే ఏర్పడిన సేన.. ఒక రాజకీయ పార్టీ అన్నాక బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, దిగ్గజాలు ఉంటారు. వారందరినీ నుంచి విరాళాలు తీసుకొని నడుస్తుంది. కానీ మకలి రాజకీయాలకు దూరంగా తన స్వంత కష్టంతో తను సినిమాల్లో సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తూ పార్టీని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. ఏ ఒక్కరి నుంచి రూపాయి ఆశించకుండా పార్టీని ఏపీలో ఈ స్థితికి చేర్చాడు.

జనసేనలో ఇన్నాళ్లు ఇద్దరే కీలక నేతలుగా.. పార్టీ వ్యవహారాలు చేసుకునేవారు. ఒకరు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉండేవారు. అయితే ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

నాగబాబుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు సేవలను మరింతగా విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో పర్యటించిన నాగబాబును పార్టీలో మరింతగా కీలక బాధ్యతలు నిర్వహించాలని జనసైనికులు కోరారు. విదేశాల్లోని పార్టీ ప్రతినిధులు, అభిమానులు సైతం ఇదే విన్నవించారు. దీంతో నాగబాబుకు ఈ ఎన్.ఆర్ఐ సేవలను పార్టీకి సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.

-వేములపాటి అజయ్ కుమార్ కు కీలక బాధ్యతలు

నాగబాబుతోపాటు పార్టీలో నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు జనసేనకు సేవలందిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ కు పార్టీకి సంబంధించి ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు. జాతీయ మీడియాకు పార్టీ తరుఫున అధికార ప్రతినిధిగా.. రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ నిర్వహణ బాధ్యతలను అజయ్ కుమార్ కు అప్పగించారు.

నాగబాబు, అజయ్ లు పార్టీకి మేలైనా సేవలు అందిస్తారన్న గట్టి నమ్మకాన్ని పవన్ వ్యక్తం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper
Exit mobile version