
Ashu Reddy : బోల్డ్ బ్యూటీ అషురెడ్డి వీకెండ్ మూడ్ లో ఉందట. మరి వీకెండ్ అంటే పార్టీలు, పబ్లు, స్నేహితులు, సరదాలు షురూ చేయాలి. దాని కోసం ఓ స్పెషల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. సదరు ట్రెండీ డ్రెస్ లో నాటీ ఫోజులతో రెచ్చగొట్టింది. అషురెడ్డి తీరు చూసిన నెటిజెన్స్ విరహ వేదనతో అల్లాడిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కాగా నెటిజెన్స్ కి అషురెడ్డి అందాలు బిగ్ ట్రీట్. తరచుగా ఆమె బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంటారు.

అషురెడ్డి స్కిన్ షో విమర్శల పాలవుతూ ఉంటుంది. అషురెడ్డికి అవేమీ పట్టదు. జనాలు మర్చిపోకుండా ఉండాలన్నా, ఆదాయం రాబట్టాలన్నా బోల్డ్ ఫోటో షూట్స్ తప్పనిసరి. అందులోనూ ఇంస్టాగ్రామ్ ఆమెకు ఆదాయమార్గంగా మారింది. పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ ఫాలోవర్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. మరి ఫాలోవర్స్ పెరగాలంటే బోల్డ్ ఫోటో షూట్స్ చేయాల్సిందే.

ఈ మధ్య బుల్లితెర మీద అషురెడ్డి సందడి తగ్గింది. గతంలో కామెడీ స్టార్స్ షోలో అషురెడ్డి కనిపించారు. ప్రస్తుతం ఆమె ఫోకస్ నటన వైపుకు మళ్లింది. కొన్ని ప్రాజెక్ట్స్ కి అషురెడ్డి సైన్ చేసినట్లు సమాచారం. అవి షూటింగ్ దశలో ఉన్నాయి. అషురెడ్డి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశాలు కొట్టిపారేయలేం. కారణం ఆమె పాపులారిటీ అంతగా పెరుగుతుంది.

అషురెడ్డి ఒకప్పుడు జస్ట్ సోషల్ మీడియా సెలబ్రిటీ. టిక్ టాక్, డబ్స్మాష్ వీడియోలు చేసేది. ఆమె వీడియోలు వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో ఆమె జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు. అదే అషురెడ్డికి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చేలా చేసింది. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు.

అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గత ఏడాది ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డికి ఛాన్స్ వచ్చింది. అక్కడ కూడా ఆమె జర్నీ త్వరగానే ముగిసింది. ఇక బోల్డ్ గా కనిపించే అషురెడ్డిలో సామాజిక కోణం కూడా ఉంది. ఆమె కొందరు అనాథ విద్యార్థులను చదివిస్తున్నారట. అప్పుడప్పుడు అనాథశరణాలయాలకు వెళ్లి సహాయం అందిస్తూ ఉంటారట.