Homeఎంటర్టైన్మెంట్RRR Movie: బిగ్ అప్డేట్ ను ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్... సెకండ్‌ గ్లింప్స్‌ అప్పుడే...

RRR Movie: బిగ్ అప్డేట్ ను ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్… సెకండ్‌ గ్లింప్స్‌ అప్పుడే…

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబ‌లి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా… చిత్ర పరిశ్రమ యావత్తు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ను మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది.

rrr team released interesting update about second glimps

ఈ సినిమాకు సంబంధించిన సెకండ్‌ గ్లింప్స్‌ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది.  45 సెకండ్ల పాటు ఉండే వీడియో  గ్లింప్స్‌ ను నవంబర్‌ 1 వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ కలిసి ఉన్న ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇటీవలే రాజ‌మౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఫైనల్ కట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాగా మూవీ లో 30 నిమిషాల పాటు క్లైమాక్స్ ఉంటుందని… ఇది సినిమాకే మేజర్ హైలెట్ అని సమాచారం. కాగా నిన్న విడుదల చేయాల్సిన ఈ అప్డేట్ ను కన్నడ  పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో… ఈరోజు  విడుదల చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular