
Ram Charan Pooja Hegde: ‘పాన్ ఇండియా ఇమేజ్’ రావడం చాలా కష్టం. అయితే, ఆర్ఆర్ఆర్ తో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’కు ఆ ఇమేజ్ చాలా ఈజీగా వచ్చింది. అందుకే, ఆ ఇమేజ్ ను కాపాడుకోవడానికి చరణ్ పర్ఫెక్ట్ గా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
కాగా, ఈ సినిమాలో ఇప్పుడు మరో క్రేజీ బ్యూటీ నటించబోతుంది. టాల్ అండ్ క్రేజీ బ్యూటీ ‘పూజా హెగ్డే’ సెకెండ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఫస్ట్ హీరోయిన్ గా కియారా అద్వానీని ఇప్పటికే ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సెకండ్ హాఫ్ లో వచ్చే మరో హీరోయిన్ గా తాజాగా ‘పూజా హెగ్డే’ను తీసుకున్నారు. నిజానికి ఈ పాత్ర చేయడానికి మొదట ఆమె ఇష్టపడలేదట.
అయితే, చరణ్ మాటను కాదు అనలేక మొత్తానికి చిన్న పాత్ర అయినప్పటికీ ఈ సినిమాను అంగీకరించింది. పూజా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో ‘మొహంజదారో’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అందుకే, పాన్ ఇండియా సినిమా అనగానే పూజా పేరు కూడా బాగా వినిపిస్తోంది.
మేకర్స్ ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయినా స్టార్ డమ్ ఉన్నంత మాత్రాన, పాన్ ఇండియా ఇమేజ్ అందరికీ రాదు. కానీ ‘పూజా హెగ్డే’కు వచ్చింది. అందుకే ఆమె డేట్లు కోసం పైరవీలు చేయాల్సి వస్తోంది. పైగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను ఇచ్చుకోవాల్సి వస్తుంది.
ఇక చరణ్ – శంకర్ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దాంతో అందరూ ఈ ప్రాజెక్ట్ పై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే, నేపథ్య సంగీతాన్ని మాత్రం అనిరుధ్ రవిచందర్ ఇస్తున్నాడట.
Also Read: ఐఏఎస్ పాత్రలో కనిపించనున్న రామ్చరణ్