https://oktelugu.com/

ఎన్టీఆర్ గాయం పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ క్లారిటీ !

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, చారబ్ లీడ్ రోల్స్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే చరణ్, తారక్ పై రాజమౌళి షూట్ గ్యాప్ లో చిల్ అవుతున్న ఫన్నీ ఒక వీడియోని రిలీజ్ చేయడం, నిన్నటి నుండి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే ఈ వీడియోలో తారక్ నుదురు పై చిన్నపాటి గాయం అయినట్లు కనిపించింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ గాయం ఏమిటి […]

Written By:
  • admin
  • , Updated On : August 8, 2021 / 10:52 AM IST
    Follow us on

    దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, చారబ్ లీడ్ రోల్స్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే చరణ్, తారక్ పై రాజమౌళి షూట్ గ్యాప్ లో చిల్ అవుతున్న ఫన్నీ ఒక వీడియోని రిలీజ్ చేయడం, నిన్నటి నుండి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే ఈ వీడియోలో తారక్ నుదురు పై చిన్నపాటి గాయం అయినట్లు కనిపించింది.

    దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ గాయం ఏమిటి అన్నట్టు చర్చ మొదలుపెట్టారు. తాజాగా ఈ గాయానికి సంబంధించి ఆర్ఆర్ఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అది ఎలాంటి గాయం కాదు అని, జస్ట్ మేకప్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ దోస్తీని ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రేక్షకులను ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటుంది.

    ముఖ్యంగా ఈ పాట విజువల్స్ లో ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ షాట్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను రాజమౌళి నేషనల్ వైడ్ గా పక్కా ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుంది. ఇక అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతుండే సరికి.. ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    పైగా హాలీవుడ్ నటీనటులు విలన్స్ గా నటిస్తున్నారు. అందుకే హాలీవుడ్ లోనూ ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. దాంతో ఈ భారీ మల్టీస్టారర్ ఇంటర్నేషనల్ వైడ్ గా మార్కెట్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ – ఒలివియా, అలాగే చరణ్ – అలియా ప్రేమ కథలు కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు.