Nizam: నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర..!

Nizam RRR Movie: ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కు అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో విడుదలకు ముందే ఈసినిమా  థ్రియేటికల్, ఓటీటీ హక్కులను భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా […]

Written By: NARESH, Updated On : December 28, 2021 3:36 pm
Follow us on

Nizam RRR Movie: ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కు అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో విడుదలకు ముందే ఈసినిమా  థ్రియేటికల్, ఓటీటీ హక్కులను భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

RRR

‘ఆర్ఆర్ఆర్’కు తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కనివిని ఎరుగని రీతిలో బిజినెస్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Rajamouli Combo: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!

మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హంగామా మొదలుకానుంది. దీంతో ఇప్పటి వరకు రిలీజైన ‘అఖండ’, ‘పుష్ప’ కథ  జనవరి 6తో ముగియడం ఖాయంగా కన్పిస్తోంది. ‘అఖండ’ కలెక్షన్లు దాదాపు ముగింపు దశకు చేరుకోగా త్వరలోనే ‘పుష్ప’, నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు కూడా పక్కకు వెళ్లే అవకాశం కన్పిస్తోంది. దీంతో వీటి రన్ టైమ్ మరో వారం రోజులేనని అర్థమవుతోంది.

ఏపీలో టికెట్ల రేట్లు, అదనపు షోల విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే తెలంగాణలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’కు అన్నిరకాలుగా కలిసి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను సింగిల్ స్క్రీన్లలో రోజుకు ఐదు షోలు వేయడానికి దాదాపు అనుమతులు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మల్టీప్లెక్సుల్లోనూ ప్రతీ స్క్రీన్లో ఐదు షోల నడిపించబోతున్నారని టాక్ విన్పిస్తోంది.

అల్లు అర్జున్ ‘పుష్ప’ లాగే ఈమూవీకి కూడా తొలివారం టికెట్ కనీస ధర సింగిల్ స్క్రీన్లలో రూ. 200, మల్టీప్లెక్సుల్లో రూ. 250 ఉండబోతోందట. దీంతో నైజాంలోని అన్ని థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నడిపేంచేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో తెలంగాణలో దాదాపు అన్ని సింగిల్ స్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడిచే అవకాశం కన్పిస్తోంది.

మొత్తంగా నైజాంలో పెరిగిన టికెట్ల ధరలతో రోజుకు ఐదు షోలు ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నడిపిస్తే అదిరిపోయే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా అయితే తొలి వారంలోనే ఈ సినిమా ‘బాహుబలి’ రికార్డులను తిరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: RRR: నా చివరి శ్వాస వరకు తారక్​ స్నేహం నా గుండెల్లో నిలిచిపోతుంది- చరణ్​