https://oktelugu.com/

Saipallavi: సాయిపల్లవిపై శ్యామ్​సింగరాయ్​ నిర్మాత ప్రశంసల వర్షం

Saipallavi: నేచురల్​ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్​. డిసెంబరు 24న విడులైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. కలకత్తా బ్యాక్​డ్రాప్​లో వచ్చిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సక్సెస్​ మీట్ నిర్వహించిన చిత్రబృందం.. ఈ సంందర్భంగా నిర్మాత వెంకట్​ బోయినపల్లి మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 02:34 PM IST
    Follow us on

    Saipallavi: నేచురల్​ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్​. డిసెంబరు 24న విడులైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. కలకత్తా బ్యాక్​డ్రాప్​లో వచ్చిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సక్సెస్​ మీట్ నిర్వహించిన చిత్రబృందం.. ఈ సంందర్భంగా నిర్మాత వెంకట్​ బోయినపల్లి మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    Saipallavi

    సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్ చేప్పారు వెంకట్​. కరోనా లాక్​డౌన్​లో ఎంతో కష్టపడి సినిమాను పూర్తి చేశామని.. ఇక సాయిపల్లవి ఈ సినిమా కోసం పడిన కష్టం గురించి కచ్చితంగా చెప్పుకోవాలని అన్నారు. 45 రోజులు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా ఎంతో కష్టపడి సినిమాకోసం పరితపించారని అన్నారు.

    Also Read: Kaliyugam Movie: ‘కలియుగం’ ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న జెర్సీ హీరోయిన్​

    శ్యామ్​ సింగరాయ్​ రచనలు హీరో అయితే… సమాజం అనేది విలన్ అని.. ఈ సినిమాలో ప్రత్యేకంగా విలన్​ అంటూ లేరని పేర్కొన్నారు. సాయి పల్లవి కథ వినగానే ఓకే అన్నారని.. ఎప్పుడూ ఎక్కడా ఆలస్యం చేయకుండా షూటింగ్​ అనుకున్నది అనుకున్నట్లు పూర్తయిందని అన్నారు. ఆమె తప్ప ఈ సినిమాలో పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరనిపించింని వివపించారు. ఇక నాని గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు వెంకట్​.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !