NTR and Charan: తెలుగు సినిమా పరిశ్రమలో ది బెస్ట్ డాన్సర్లంటే ముందుగా వచ్చే హీరోల పేర్లలో ముందు వరుసలో ఉండే పేరు ఎన్టీఆర్ ది, ఆ తర్వాత కనిపించే పేరు చరణ్ ది. మధ్యలో బన్నీ ఉన్నాడు అనుకోండి. కానీ చరణ్ కి మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా చరణ్ స్టెప్స్ నే అభిమానులు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మరి ఈ టాప్ డ్యాన్సర్ల పోటీ పడి స్టెప్స్ వేస్తే.. ఇక చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

కాగా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ రాబోతుంది. ఈ సినిమాలోని రెండో పాటగా రాబోతున్న ఈ సాంగ్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ లో కోమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పోటా పోటీగా స్పెప్పులు వేయబోతున్నారు.
అయితే, ఈ సాంగ్ లో డ్యాన్స్ పై ఇప్పటికే ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ స్టెప్పుల్లో మాస్, గ్రేస్.. చరణ్ డ్యాన్స్ లో మిస్ అయిందని.. ఎన్టీఆర్ ముందు చరణ్ తేలిపోయాడని తెలుస్తోంది. అయినా ఎన్టీఆర్ తో ఒకే సారి పక్క పక్కన తన పాదం కదపడం అంత ఈజీ కాదు అని చరణ్ అందరికీ చెబుతున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి చరణ్ భయపడ్డాడట.
నిజానికి ఎన్టీఆర్ – చరణ్ ఈ సినిమాలో నువ్వా? నేనా? అనే తరహా పాత్రలు పోషిస్తున్నారు. కానీ, ఎన్టీఆర్ ముందు చరణ్ ఇలా తేలిపోతే.. ఇక నువ్వా? నేనా? అనేది ఏమి ఉంటుంది ? దీనికితోడు మొదటి నుంచి రాజమౌళి, సినిమాలో ఎన్టీఆర్ హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే, ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఎన్టీఆర్ కే ఉంటుందట.
Also Read: Keerthi Suresh: ‘గుడ్‌లక్ సఖి’ నుంచి ‘బ్యాడ్ లక్ సఖి’ సాంగ్ రిలీజ్!
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే రాజమౌళి ప్లాన్ చేశాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవిత కథల ఆధారంగా రాజమౌళి ఈ సినిమా చేస్తున్నందుకు అభినందించాలి. పైగా ఈ సినిమాలో ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: Balayya: ఆ కుర్రాడికి ఇచ్చిన మాటను నెలబెట్టుకున్న బాలయ్య!