https://oktelugu.com/

Akhanda Unbreakable Record: అఖండ రికార్డుని బ్రేక్ చెయ్యలేకపోయినా #RRR

Akhanda Unbreakable Record: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.. అనకాపల్లి నుండి అమెరికా వరుకు ఈ సినిమాకి వచ్చిన లాంగ్ రన్ ఇటీవల కాలం లో ఏ సినిమాకి కూడా రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..అందరి అంచనాలను అధిగమించి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 17, 2022 / 12:27 PM IST
    Follow us on

    Akhanda Unbreakable Record: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది..

    Balakrishna

    అనకాపల్లి నుండి అమెరికా వరుకు ఈ సినిమాకి వచ్చిన లాంగ్ రన్ ఇటీవల కాలం లో ఏ సినిమాకి కూడా రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..అందరి అంచనాలను అధిగమించి 75 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని సాధించిన ఈ చిత్రం, బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది..కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు..50 రోజుల సెంటర్స్ విషయం లో కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 100 కి పైగా కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పొయ్యేలా చేసింది..

    Also Read: Dinesh Karthik: స్పూర్తినిచ్చే కథ: తోటి క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకొని వెళ్లిపోయిన భార్య .. కృంగిపోయిన దినేష్ కార్తీక్ ఎలా సక్సెస్ బాట పట్టాడు?

    ఎందుకంటే OTT వాడకం వల్ల థియేట్రికల్ రన్ బాగా తగ్గిపోతున్న సమయం లో ఒక్క మూవీ విడుదల అయ్యి 50 రోజులు వందకి పైగా సెంటర్స్ లో పూర్తి చేసుకోవడం అంటే మాములు విషయం కాదు..ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు సృష్టించినప్పటికీ కూడా, అఖండ సినిమా 50 రోజుల రికార్డు కి మాత్రం దగ్గర్లోకి కూడా రాలేకపోయింది అనే చెప్పాలి..ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 35 సెంటర్స్ లో మాత్రమే అర్థ శత దినోత్సవం జరుపుకుంది..అలా 50 రోజుల సెంటర్స్ విషయం లో అఖండ సినిమాకి దగ్గర్లోకి కూడా #RRR చిత్రం రాలేకపోయింది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

    RRR

    Also Read: CM YS Jagan: వైసీపీలో జగన్ పట్టు సడలుతుందా?.. కట్టుదాటుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
    Recommended Videos


    Tags