RRR Box Office Collection: జక్కన్న చెక్కిన మాయాజాలం త్రిబుల్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా అంతటా విజయ ప్రభంజనమే మోగిస్తోంది. మొదటి నుంచి ఈ మూవీపై ఉన్న భారీ అంచానాలే ఇందుకు ప్రధాన కారణం. పైగా రాజమౌళి దర్శకత్వం చేయడం ఒక కారణం అయితే.. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు యాక్ట్ చేయడం మరో కారణం.

టాలీవుడ్ లో ఈ ఇద్దరివీ పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న కుటుంబాలు. అందుకే ఈ మూవీని మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ పెద్ద హిట్ చేసేశారని చెప్పుకోవాలి. అయితే గడిచిన వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచినా.. కూడా లోకల్ సినిమాల కలెక్షన్లను మాత్రం ఈ పాన్ ఇండియా మూవీ టచ్ చేయలేదు.
Also Read: Nara Lokesh: జనం చెవిలో జగన్ పూలు.. లోకేష్ సెటైరికల్ ట్వీట్.. మార్పు మొదలైందా..?
త్రిబుల్ ఆర్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.453 కోట్లను నిర్ధారించారు. కాగా ఆరు రోజులుగా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన త్రిపుల్ ఆర్ ఏడోరోజు చతికిల పడిపోయింది. ఏడో రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.7.48 కోట్ల షేర్ ను అలాగే రూ. 11.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది త్రిబుల్ ఆర్ మూవీ.
మొత్తంగా ఏడు రోజుల్లో కలిపి రూ.392.45 కోట్ల షేర్ ను అలాగే రూ.710 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.60.55 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే ఏడో రోజు ఐకాన్ స్టార్ సినిమా రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పటి వరకు ఏడోరోజు అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా అల వైకుంఠపురంలో మూవీ టాప్ లో ఉంది.
ఈ మూవీకి ఏడో రోజు రూ.8.43కోట్ల షేర్ రాగా.. బాహుబలి-2 మూవీకి రూ.8.30 కోట్లు, సైరా మూవీ రూ.7.90కోట్ల షేర్ వచ్చింది. అలాగే మహేశ్ మూవీ సరిలేరు నీకెవ్వరు రూ.7.64కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ మాత్రం 7వ రోజు రూ.7.48కోట్ల షేర్ వసూలు చేసి 5వ ప్లేస్ లో నిలబడింది. మరి రెండో వారం కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read: Plastic Surgery Tollywood Actress: సర్జరీలు చేయించుకుని స్టార్ హీరోయిన్లుగా మారిన నటీమణులు వీరే..