https://oktelugu.com/

R.P. Patnayak : సాయి తేజ్ పైనే కాదు, వారి పై కేసు పెట్టాలి – ఆర్పీ

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాల పై ఇప్పటికే పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా సీనియర్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ తేజ్ కి జరిగిన ప్రమాదం పై సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆర్పీ పట్నాయక్‌ మెసేజ్ చేస్తూ… ‘యాక్సిడెంట్‌ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై […]

Written By:
  • admin
  • , Updated On : September 11, 2021 / 05:23 PM IST
    Follow us on

    మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాల పై ఇప్పటికే పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా సీనియర్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ తేజ్ కి జరిగిన ప్రమాదం పై సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

    ఆర్పీ పట్నాయక్‌ మెసేజ్ చేస్తూ… ‘యాక్సిడెంట్‌ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలన్నారు.

    ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని తన అభిప్రాయం’ అని ఆర్పీ ఒక పోస్ట్‌ పెట్టారు. కేవలం రోడ్డు పై ఇసుక పేరుకుపోవడం కారణంగానే సాయి తేజ్ బైక్‌ స్కిడ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మాదాపూర్‌ ఏసీసీ కూడా అధికారికంగా వెల్లడించింది.

    మరి పోలీసులు ఆర్పీ పట్నాయక్ పెట్టిన మెసేజ్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే సాయి తేజ్ పై రాయదుర్గం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రాష్‌ డ్రైవింగ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రస్తుతం సాయి తేజ్ వెంటిలెటర్‌ పై చికిత్స తీసుకుంటుంన్నారు. సాయి తేజ్ అతి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆర్పీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.

    కాగా దుర్గం చెరువు వంతెనపై నుంచి ఐకియా వైపు సాయి తేజ్ స్పోర్ట్స్‌ బైక్‌పై నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయితేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది.