మరోసారి మెగాఫోన్‌ పడుతున్న ఆర్పీ

ఆర్పీ పట్నాయక్‌ ఎన్నో తెలుగు సినిమాలకు హిట్‌ సాంగ్స్‌ అందించారు. తన మ్యూజిక్‌తో యూత్‌ను సైతం మెస్మరైజ్‌ చేసేశారు. ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించిన 90 శాతం సినిమాలు హిట్లే. ఓ ద‌శ‌లో ఆర్పీ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. తన స్వరాలతోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. Also Read: మరో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌‌లో సునీల్‌ ఆ త‌రువాత‌ ఎందుకో న‌ట‌న‌పై దృష్టి పెట్టాడు ఆర్పీ. అక్కడ్నుంచి త‌న గ్రాఫ్ ప‌డిపోవ‌డం మొద‌లైంది. ద‌ర్శకుడిగా మారినా.. విజ‌యాలు ద‌క్కలేదు. […]

Written By: Srinivas, Updated On : December 26, 2020 1:05 pm
Follow us on


ఆర్పీ పట్నాయక్‌ ఎన్నో తెలుగు సినిమాలకు హిట్‌ సాంగ్స్‌ అందించారు. తన మ్యూజిక్‌తో యూత్‌ను సైతం మెస్మరైజ్‌ చేసేశారు. ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించిన 90 శాతం సినిమాలు హిట్లే. ఓ ద‌శ‌లో ఆర్పీ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. తన స్వరాలతోనూ అందరినీ ఆకట్టుకున్నాడు.

Also Read: మరో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌‌లో సునీల్‌

ఆ త‌రువాత‌ ఎందుకో న‌ట‌న‌పై దృష్టి పెట్టాడు ఆర్పీ. అక్కడ్నుంచి త‌న గ్రాఫ్ ప‌డిపోవ‌డం మొద‌లైంది. ద‌ర్శకుడిగా మారినా.. విజ‌యాలు ద‌క్కలేదు. దాదాపు అర‌డజ‌ను సినిమాలు తీశాడు. ఏదీ సంతృప్తినివ్వలేదు. కొన్నాళ్లుగా సంగీతానికి, ద‌ర్శక‌త్వానికీ దూరంగా ఉన్నారాయ‌న‌. ఇప్పుడు మ‌ళ్లీ మెగాఫోన్‌పై ఆశ పుట్టినట్లుంది.

Also Read: బోల్డ్ స్టోరీలో మాజీ బబ్లీ బ్యూటీ !

ఆర్పీ దర్శకుడిగా మరో సినిమా నిర్మించనున్నారు. దానిపేరే ‘కాఫీ విత్ కిల్లర్‌’. ఇదో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌. న‌ట‌న‌, ద‌ర్శక‌త్వం, సంగీతం, నిర్మాణం.. ఇలా అన్ని ర‌కాల బాధ్యత‌ల్నీ మ‌ళ్లీ త‌న‌పైనే వేసుకున్నాడు ఆర్పీ. షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వర‌లోనే విడుద‌ల చేస్తారని టాక్‌. మరోవైపు.. ఓ వెబ్ సిరీస్‌కు ఆర్పీ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచైనా ఆర్పీ ప్రయాణం ట్రాక్ లో ప‌డుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్