https://oktelugu.com/

మరో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌‌లో సునీల్‌

తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. మరో కమెడియన్‌, ఆతర్వాత హీరోగా పరిచమైన వ్యక్తి సునీల్‌. సునీల్‌–త్రివిక్రమ్‌ కెరీర్‌‌లు దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఒకేసారి విశ్వరూపం దాల్చాయి. వాళ్ల ఫ్రెండ్ షిప్ సినిమా సినిమాకీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఓ ద‌శ‌లో సునీల్ హీరోగా, త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్రచారం కూడా జరిగింది. Also Read: బోల్డ్ స్టోరీలో మాజీ బబ్లీ బ్యూటీ ! ఈ సినిమాకు ‘బంతి’ అనే పేరు కూడా వినిపించింది. అయితే […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2020 / 12:55 PM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. మరో కమెడియన్‌, ఆతర్వాత హీరోగా పరిచమైన వ్యక్తి సునీల్‌. సునీల్‌–త్రివిక్రమ్‌ కెరీర్‌‌లు దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఒకేసారి విశ్వరూపం దాల్చాయి. వాళ్ల ఫ్రెండ్ షిప్ సినిమా సినిమాకీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఓ ద‌శ‌లో సునీల్ హీరోగా, త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్రచారం కూడా జరిగింది.

    Also Read: బోల్డ్ స్టోరీలో మాజీ బబ్లీ బ్యూటీ !

    ఈ సినిమాకు ‘బంతి’ అనే పేరు కూడా వినిపించింది. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. క‌మెడియ‌న్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాక‌.. త్రివిక్రమ్ సినిమాల్లో మంచి క్యారెక్టర్లే ప‌డ్డాయి సునీల్‌కి. అయితే అవేం ఇది వ‌ర‌క‌టి స్థాయిలో లేవన్నది నిజం. అందుకే ఇప్పుడు త‌న స్నేహితుడు సునీల్ కోసం ఓ వెరైటీ క్యారెక్‌టర్‌‌ను సృష్టించాడ‌ట త్రివిక్రమ్.

    Also Read: సోహెల్ సినిమా మొదలైంది.. మెగాస్టార్ ఏమంటారో ?

    ఎన్టీఆర్‌‌తో మాట‌ల మాంత్రికుడు ఓ సినిమా చేస్తున్నారనేది వాస్తవం. ఇందులో సునీల్‌కు చాలా మంచి పాత్ర ప‌డింద‌ట‌. అయితే ఈసారి మాత్రం సునీల్ కామెడీ చేయ‌డు. అలాగ‌ని సీరియ‌స్ టైపు పాత్ర కూడా కాదు. ఈ రెండింటికీ అంద‌ని ఓ క్యారెక్టర్‌ రాశాడ‌ట‌. సునీల్ ఇలాంటి పాత్ర కూడా చేయ‌గ‌ల‌డా? అనుకునేలా ఈ క్యారెక్టర్‌ని త్రివిక్రమ్ తీర్చిదిద్దాడ‌ని తెలుస్తోంది. నిజానికి.. ముందు అనుకున్న స్క్రిప్టులో సునీల్ పాత్ర లేదు. లాక్ డౌన్‌లో స్క్రిప్టుని మ‌ళ్లీ రీ రైట్ చేసే వీలు ద‌క్కింది త్రివిక్ర‌మ్ కి. ఆ టైమ్ లో సునీల్ పాత్ర‌.. కొత్తగా వ‌చ్చి చేరింద‌ట‌. సునీల్ కెరీర్‌లో ఇదో ఛాలెంజింగ్ రోల్ అవుతుంద‌ని స‌మాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్