https://oktelugu.com/

Jabardasth Varsha-Emmanuel: వర్ష, ఇమ్మానియేల్ ప్రైవేట్ ఫోటో అందరి ముందు లీక్ చేసిన రోజా..!

Jabardasth Varsha-Emmanuel: బుల్లితెరపై ప్రేమ జంటలు ఎక్కువైపోయాయి. బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్… కార్యక్రమం ఏదైనా రోజుకో ప్రేమ జంట పుట్టుకు వస్తుంది. ఈ ట్రెండ్ ఇప్పటి కాదు. వృత్తిపరంగా దగ్గరైన టీవీ సెలబ్రిటీలు ప్రేమికులై, ఆపై పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా బుల్లితెరను ఊపేస్తున్న ప్రేమ జంట వర్ష-ఇమ్మానియేల్. జబర్దస్త్ వేదికగా వీరి మధ్య ప్రేమ చిగురించగా.. ఒకరికోసం ఒకరు అన్నట్లు బ్రతికేస్తున్నారు. సీరియల్ నటి వర్ష కొన్ని నెలల క్రితం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 3, 2021 / 12:36 PM IST
    Follow us on

    Jabardasth Varsha-Emmanuel: బుల్లితెరపై ప్రేమ జంటలు ఎక్కువైపోయాయి. బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్… కార్యక్రమం ఏదైనా రోజుకో ప్రేమ జంట పుట్టుకు వస్తుంది. ఈ ట్రెండ్ ఇప్పటి కాదు. వృత్తిపరంగా దగ్గరైన టీవీ సెలబ్రిటీలు ప్రేమికులై, ఆపై పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా బుల్లితెరను ఊపేస్తున్న ప్రేమ జంట వర్ష-ఇమ్మానియేల్. జబర్దస్త్ వేదికగా వీరి మధ్య ప్రేమ చిగురించగా.. ఒకరికోసం ఒకరు అన్నట్లు బ్రతికేస్తున్నారు. సీరియల్ నటి వర్ష కొన్ని నెలల క్రితం జబర్దస్త్ షోకి రావడం జరిగింది. వర్ష గ్లామర్ కి జబర్దస్త్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీనితో చాలా తక్కువ సమయంలోనే ఆమె ఫుల్ ఫేమస్ అయ్యారు.

    Jabardasth Varsha-Emmanuel

    ఏళ్ల తరబడి సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షోతో ఆమెకు దక్కింది. ఈ క్రమంలో వర్ష ఇమ్మానియేల్ దగ్గరయ్యారు. కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ వెంటపడే అమ్మాయిగా వర్షను చూపించేవారు. ఈ స్కిట్స్ కి మంచి ఆదరణ దక్కింది. స్కిట్స్ లోనే కాకుండా ఇమ్మానియేల్ తో వర్ష సన్నిహితంగా ఉండటం, అతనంటే తనకు ఇష్టం అన్నట్లు చెప్పడం తో వీరిద్దరి పై ప్రేమ పక్షులన్న బ్రాండ్ నేమ్ పడిపోయింది. అయితే ఇదంతా కేవలం కెరీర్ కోసం, స్కిట్స్ కోసమే అని… కొందరి భావన.

    Also Read: తన తల్లితో చేసిన వాట్సాప్​ చాట్​ను నెట్టింట్లో షేర్​ చేసిన సమంత.. అందులో ఏముందో తెలుసా?

    రష్మీ-సుధీర్ రేంజ్ లో పాపులరైన వర్ష ఇమ్మానియేల్ మధ్య ఏమి నడుస్తుందనేది ఎవరికీ తెలియదు. తాజాగా జబర్దస్త్ జడ్జి రోజా వారిద్దరి పర్సనల్ ఫోటో లీక్ చేసింది. సదరు ఫొటోలో వర్ష ఇమ్మానియేల్ కారులో పక్కపక్కన కూర్చొని షికారు చేస్తున్నారు. ఆ ఫోటో చూపిస్తూ రోజా ఇద్దరినీ జబర్దస్త్ వేదికపై నిలదీశారు. కారులో షికార్లు, మ్యాచింగ్ డ్రెస్లు… ఏంటి కథ అని అడిగారు. ఓ షూట్ లో ఉన్నప్పుడు ఇమ్మానియేల్ ఫోన్ చేశాడని, తనకు హెల్త్ బాగోక పోతే వచ్చి పికప్ చేసుకున్నాడని వర్ష వివరణ ఇచ్చింది. ఇన్నాళ్లు వీళ్లది మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే ఉందని నమ్మిన వాళ్లకు, ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ కొనసాగిస్తున్నారని క్లారిటీ వచ్చింది.

    Also Read: ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తో సినిమా చేయనున్న హీరో విక్రమ్…

    Tags