https://oktelugu.com/

Ravi Teja: లక్​ అంటే రవితేజదే.. కొంచెంలో అట్టర్​ఫ్లాప్​ మిస్​

Ravi Teja: మాస్​మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్నాడు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్న ఈ హీరో.. వరుస సినిమాలను ఒప్పుకుని తీరక లేకుండా షూటింగ్​ల్లో గడుపుతున్నాడు. కాగా, ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఖిలాడి. మరోవైపు త్రినాధ్​ రావు దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే మరో సినిమాలోను నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దీన్ని బట్టి మాస్​ మహారాజ్​ ఇటీవల కాలంలో సనిమాల ఎంపిక విషయంలో చాలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 12:45 PM IST
    Follow us on

    Ravi Teja: మాస్​మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్నాడు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్న ఈ హీరో.. వరుస సినిమాలను ఒప్పుకుని తీరక లేకుండా షూటింగ్​ల్లో గడుపుతున్నాడు. కాగా, ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఖిలాడి. మరోవైపు త్రినాధ్​ రావు దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే మరో సినిమాలోను నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దీన్ని బట్టి మాస్​ మహారాజ్​ ఇటీవల కాలంలో సనిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

                                                          Ravi Teja’s First Look Poster from Ravanasura

    అయితే, ఇటీవలే విడుదలైన అనుభవించు రాజా సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్​ అయిన సంగతి తెలిసిందే. రాజ్​తరుణ్​, ఖుషీష్​ ఖాన్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమాకు మొదట దర్శకుడు గవిరెడ్డి రవితేజను సంప్రదించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం వరుస షెడ్యూల్​తో బిజీగా ఉండటం వల్ల కుదరదని చెప్పేశాడట. దీంతో.. రాజ్​తరుణ్​ని సంప్రదించి ఈ సినిమాను ఒప్పించాడట. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    Also Read: శరవేగంగా రామారావు షూటింగ్​.. మారేడుమల్లిలో యాక్షన్​ సీన్స్​ చిత్రీకరణ!

    కాగా, క్రాక్​ సినిమాతో మంచి బ్లాక్​బాస్టర్​ హిట్ కొట్టిన రవితేజ.. ఇకపైనా ఇలాంటి తరహాలనే మాస్​ యాక్షన్​ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: బిరుదు ఏమో మాస్ మహారాజా.. ఇమేజ్ మాత్రం వెటకారం రాజా !