https://oktelugu.com/

Rohini : ‘బిగ్ బాస్ 8’ నుండి రోహిణి అవుట్.. 9 వారాలకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..ఈ రికార్డుని ఎవ్వరూ కొట్టలేరేమో!

డిజాస్టర్ అవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ 8 ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కాపాడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అవినాష్, రోహిణి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోవడం కష్టం.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 03:18 PM IST

    Rohini

    Follow us on

    Rohini : డిజాస్టర్ అవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ 8 ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కాపాడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అవినాష్, రోహిణి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోవడం కష్టం. అయితే షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే శనివారం కి సంబంధించిన ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఈ ఎపిసోడ్ లోనే రోహిణి ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. ఈ సీజన్ లో ఈమెకి పడినటువంటి పాజిటివ్ ఎపిసోడ్స్ ఏ కంటెస్టెంట్ కి కూడా పడలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే అందించేది. అది కూడా అవినాష్ ఉండడం వల్లనే రోహిణి కి కలిసొచ్చింది, అవినాష్ లేని రోహిణి బిగ్ బాస్ ప్రయాణాన్ని ఊహించుకోవడం కష్టమే అంటూ లోపల ఉన్నటువంటి హౌస్ మేట్స్ కొంతమంది ఆమెని తీవ్రంగా అవమానించారు.

    ముఖ్యంగా పృథ్వీ రాజ్ శెట్టి చాలా అహంకారంతో రోహిణి ని బాడీ షేమింగ్ చేయడం, నువ్వు ఎంటర్టైన్మెంట్ కి తప్ప, ఈ హౌస్ లో దేనికి పనికిరావు అంటూ ఆమెని ఎంతో దారుణంగా అవమానించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న రోహిణి, తనకి టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు శివంగి లాగ రెచ్చిపోయింది. ఆడపులి లాగా మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా తనని అతి దారుణంగా అవమానించిన పృథ్వీ ని అతి కష్టమైన టాస్కులో ఓడించి ఏ కంటెస్టెంట్ పొందలేనంత ప్రశంసలను ఆమె ఆడియన్స్ నుండి అందుకుంది. ఆ ఒక్క ఎపిసోడ్ తో రోహిణి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కచ్చితంగా ఈమె టాప్ 5 లో ఉంటుంది, విన్నర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఆమె ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడం దురదృష్టకరం.

    ఈమెకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ, యూత్ ఆడియన్స్ లో మాత్రం ఫాలోయింగ్ లేదు. మొదటి నుండి ఆమె నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో. ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాకపోవడం వల్లనే రోహిణి ఎలిమినేట్ అవ్వడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు. దానికి తోడు ఈమెకు ఈ వారం సరైన పాజిటివ్ ఎపిసోడ్స్ కూడా పడకపోవడం మరో మైనస్ గా పరిగణించొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ కోసం రోహిణి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. రోహిణి బుల్లితెర మీద, అలాగే వెండితెర మీద మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్ట్. అందుకే ఆమెకు వారానికి మూడు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఓకే చెప్పింది. ఆ ఒప్పందం మీద బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిణి 9 వారాలు హౌస్ లో కొనసాగినందుకు 27 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం.