Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని చిత్తుచిత్తుగా బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఒకప్పుడు ఖాన్స్ సినిమాలు విడుదలైతే బాక్స్ ఆఫీస్ ఎలా కళకళలాడిపోయేదో, ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రానికి అదే రిపీట్ అవుతుంది. తన మ్యానరిజమ్స్, యాక్షన్, ఫైట్స్, యాటిట్యూడ్, డ్యాన్స్ తో బాలీవుడ్ లో మ్యాజిక్ క్రియేట్ చేసేసాడు మన బన్నీ బాయ్. రెండు రోజుల్లో ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందులో సగానికి పైగా బాలీవుడ్ ఆడియన్స్ ఇచ్చిన వసూళ్లే ఉండడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియా లో పెద్ద కాంట్రవర్సి ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో అల్లు అర్జున్ పలికే ‘ఎవడ్రా బాస్’ అనే డైలాగ్ పెను దుమారమే రేపింది. సోషల్ మీడియా లో చిరంజీవి అంటే నచ్చని కొంతమంది యాంటీ ఫ్యాన్స్, ఇది చిరంజీవి ని ఉద్దేశించి అన్నాడని దురాభిమానుల చిరంజీవి ని వెక్కిరిస్తూ అనేక పోస్టులు వేశారు. ఇదంతా గమనించిన మూవీ టీం, సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని కొంతమంది నెటిజెన్స్ తమకు అనోకాలంగా వక్రీకరించి మాట్లాడినట్టు ట్వీట్స్ వేసిన ప్రతీ ఒక్కరిపై లీగల్ యాక్షన్ ఉంటుందని, ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని నిన్న మైత్రీ మూవీ మేకర్స్ నెటిజెన్స్ కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా లో గత కొంత కాలంగా అల్లు అర్జున్ అభిమానులకు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులకు పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తోడుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇలా చాలా రోజుల నుండి ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. అయితే ఈమధ్య ఫ్యాన్ వార్స్ హద్దులు దాటి వేరే లెవెల్ కి చేరుకున్నాయి. సోషల్ మీడియా ని నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ డైలాగ్స్ ని వక్రీకరించి ఇష్టమొచ్చినట్టు పెడార్థాలు తీసిన వారికి ఒక వార్నింగ్ బెల్ లాగా ఇచ్చారు మేకర్స్. మరి ఇక నుండైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపుతారో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం వీకెండ్ లోనే 700 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టే దిశగా దూసుకుపోతుంది. సోమవారం నుండి స్టడీ కలెక్షన్స్ ఉంటే ఈ చిత్రానికి మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది.