Google Maps: ఒకప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అడ్రస్ అడుక్కుంటూ వెళ్లేవారం. కొన్ని పట్టణాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఉండేవి. ఇక గ్రామాలకు వెళ్తే వ్యక్తు పేర్లు, ఇంటిపేర్లు చెబితే అడ్రస్ చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. టెక్నాలజీ పెరగడంతో అందరూ గూగుల్‌ను నమ్ముకుంటున్నారు. కొత్త ్ర‘పదేశాలకు వెళ్లేవారంతా గూగుల్‌ను నమ్ముకుంటున్నారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని చాలా మంది ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నా.. చాలా మంది ఇప్పటికీ దీనినే ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు కారులో పెళ్లికి బయల్దేరారు. రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. అయితే వంతెన కూలిపోయి ఉన్న విషయం తెలియక వేగంగా వెళ్లి నదిలో పడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురూ దుర్మరణం చెందారు.
గోవా అడవిలో..
తాజాగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గోవాకు వెళ్లిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపింది. బిహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవాకు బయల్దేరింది. ఈ కుటుంబంలో చిన్నారులతోపాటు మొత్తం ఆరుగురు ఉన్నారు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కర్నాటకలోని బెలగాని జిల్లా ఖానాపూర్ దాటిన తర్వాత షిరోడగ, హెమ్మగూడ గ్రామాల మధ్య గుండా దారి చూపింది. దానిని అనుసరించి న వీరు బీమగగ్ వైల్డ్‌లైఫ్ జోన్‌లో ఏడు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కూడా లేదు. అప్పటికే చీకటి పడింది. దీంతో ఎటు వెళ్లాలో తెలియక రాత్రంతా అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అడవి జంతువుల బారిన పడకుండా కారు లాక్ చేసుకుని ఉండిపోయారు.
ఉదయం వెనక్కి..
తెల్లవారిన తర్వాత కారులో మళ్లీ మూడు కిలోమీటర్లు వెనక్కి వచ్చారు. అక్కడ మొబైల్ నెట్‌వర్క్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సహాయం కోరారు. వారు అక్కడకు చేరుకుని బెలగావి పోలీస్ కంట్రోల్ రూం ఖానాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు, జీపీఎస్ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు.