https://oktelugu.com/

Robin Hood Teaser: రాబిన్ హుడ్ టీజర్ రివ్యూ: సరికొత్త రోల్ లో మెస్మరైజ్ చేసిన నితిన్… ఈ దొంగోడి లాజిక్ కేక!

ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ వెంకీ కుడుములను చిరంజీవి పక్కన పెట్టేశాడు. దీంతో మరలా నితిన్ వద్దకు వచ్చాడు. ఈ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : January 26, 2024 / 05:20 PM IST

    Robin Hood Teaser

    Follow us on

    Robin Hood Teaser: హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుములతో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ భీష్మ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన భీష్మ సూపర్ హిట్ కొట్టింది. భీష్మ అనంతరం నితిన్ చాలా సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. మరోవైపు దర్శకుడు వెంకీ కుడుముల హీరో చిరంజీవి కోసం ట్రై చేసి తృటిలో ఛాన్స్ చేజార్చుకున్నాడు. భీష్మ మూవీ చూసిన చిరంజీవి వెంకీ కుడుములకు ఆఫర్ ఇచ్చాడు. ఈ క్రమంలో స్క్రిప్ట్ డెవలప్ చేసి వినిపించాడు. చిరంజీవి కూడా ఇంప్రెస్ అయ్యాడు.

    ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ వెంకీ కుడుములను చిరంజీవి పక్కన పెట్టేశాడు. దీంతో మరలా నితిన్ వద్దకు వచ్చాడు. ఈ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. రష్మిక మందానను హీరోయిన్ గా మరోసారి వెంకీ కుడుముల రిపీట్ చేయాలి అనుకున్నాడు. ఛలో మూవీతో రష్మిక మందానకు వెంకీ కుడుముల బ్రేక్ ఇచ్చాడు. ప్రకటన వీడియోలో కూడా రష్మిక మందాన నటించింది.

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నితిన్-వెంకీ కుడుముల చిత్రం నుండి సర్ప్రైజ్ అప్డేట్ వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర టైటిల్, కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. డబ్బు చాలా చెడ్డది… అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడుతుందంటూ.. నితిన్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు. నితిన్ దొంగ పాత్ర చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చేశారు.

    భారత దేశంలోని ఆస్తులు ఉన్న అన్నలు, ఆభరణాలు ధరించిన అక్క చెల్లెళ్ళు తన చుట్టాలు అంటున్న హీరో… నా వాళ్ళ దగ్గర అవసరానికి తీసుకుంటే తప్పేంటి? అని లాజిక్ మాట్లాడుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. దోచిన డబ్బులు, నగలు హీరో ఒక చోట దాస్తున్నాడు. మరి హీరో మంచి దొంగా చెడ్డ దొంగా? అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఈ ప్రాజెక్ట్ నుండి రష్మిక తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది నిజమే అని తేలిపోయింది. క్యాస్టింగ్ నుండి ఆమె పేరు లేపేశారు. రాబిన్ హుడ్ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.