Robin Hood Review : సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యంగ్ హీరోలు మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే నితిన్(Nithin) లాంటి హీరో తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ (RobinHud) అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాతో కమర్షియల్ గా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్న నితిన్ తను అనుకున్న సక్సెస్ ని దక్కించుకున్నాడా? లేదా అనేది ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎన్టీయార్ టైనింగ్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు ఒక థ్రిల్ ఫీల్ ఇస్తుందని చెబుతున్నారు. అలాగే డేవిడ్ వార్నర్ క్యామియో కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయిందట… కానీ ఈ సినిమా రొటీన్ రొట్ట ఫార్ములా లో సాగుతుంది ఒక పది సంవత్సరాల క్రితం రావాల్సిన ఒక స్టోరీని తీసుకొని సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాపను కామెడీతో లాగించేస్తు ఉంటారు.
కాబట్టి ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఇష్టపడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా 28వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ రివ్యూ రావడంతో సినిమా యూనిట్ లో కూడా కొంతవరకు కలవరం అయితే కలుగుతుంది. మరి సగటు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి సూపర్ సక్సెస్ ని చేస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ మూవీతో నితిన్ కి భారీ సక్సెస్ పడితే తప్ప ఆయన మార్కెట్ అయితే విపరీతంగా పెరిగే అవకాశం అయితే లేదు. ఇక తన తోటి హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు సాగుతుంటే ఆయన మాత్రమే ఇంకా తెలుగు సినిమాలనే చేస్తూ సక్సెసుల కోసం పరితపిస్తున్నాడు…
ఇక ఈ సినిమా ఇటు నితిన్ కి, అటు వెంకీ కుడుముల ఇద్దరికి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే వెంకీ కుడుముల ఇంతకుముందు చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక టాక్ అయితే వచ్చింది. మరి ఆ సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఈ సినిమా చేశాడు కాబట్టి ఈ మూవీతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
Also Read : ఇవేమి బుకింగ్స్ సామీ..’రాబిన్ హుడ్’ నితిన్ కెరీర్ లోనే వరస్ట్!