Robin Hood : యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు నితిన్(Hero Nithin). ముఖ్యంగా నైజాం ప్రాంతంలో నితిన్ కి మంచి మార్కెట్ ఉంటుంది. కానీ ఒక హిట్ తర్వాత అదే ఫామ్ ని కొనసాగించకపోవడం నితిన్ కెరీర్ కి పెద్ద దెబ్బ వేస్తూ వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆయన చాలా వీక్ అని చెప్పక తప్పదు. అందుకే ఆయన ఇప్పటికీ మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోగానే మిగిలిపోయాడు. ఒకానొక దశలో తన సినిమాలు పూర్తి అయ్యి, బిజినెస్ అవ్వక రిలీజ్ కి నోచుకోని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి నితిన్ ఇష్క్ చిత్రం నుండి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత హిట్స్ చాలానే పడ్డాయి కానీ, అంతకు మించి ఫ్లాప్స్ కూడా పడ్డాయి. ఆయన గత రెండు చిత్రాలు ఎలాంటి డిజాస్టర్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే.
Also Read : ‘రాబిన్ హుడ్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత వసూళ్లు రావాలో తెలుసా..?
అలాంటి డిజాస్టర్స్ తర్వాత తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ ని అందించిన వెంకీ కుడుముల తో ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) అనే చిత్రం చేసాడు. ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. కానీ ఈ చిత్రం మీద నితిన్ గత రెండు సినిమాల ఫ్లాప్స్ ప్రభావం చాలా గట్టిగానే పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి వంద టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదంటే నమ్ముతారా?, కానీ నమ్మాలి, ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఇంతటి డిజాస్టర్ రెస్పాన్స్ నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకు రాలేదు. టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, అయినప్పటికీ ఈ రేంజ్ బుకింగ్స్ అంటే నమ్మశక్యంగా లేదు.
హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ తో పోలిస్తే ఓవర్సీస్ కాస్త బెటర్ అనొచ్చు. కేవలం రాబిన్ హుడ్ చిత్రానికి మాత్రమే కాదు, ‘మ్యాడ్ స్క్వేర్’ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. చిన్న పిల్లలకు పదవ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దాని ప్రభావం ఈ రెండు సినిమాల పై పడిందని స్పష్టంగా బుకింగ్స్ చూస్తేనే అర్థం అవుతుంది. కానీ ఉగాది సీజన్ కాబట్టి టాక్ వస్తే రెండు సినిమాలకు భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంది. కానీ ఉగాది ముగిసిన తర్వాత కూడా పరీక్షలు ముగిసే వరకు వసూళ్లపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రం గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల అవ్వాల్సి ఉంది. ఆ సీజన్ లో విడుదల అయ్యుంటే నితిన్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిదేమో, ఇప్పుడు చాలా సవాళ్లు ఉన్నాయి, వాటిని అధిగమించి ఈ చిత్రం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.