Homeక్రైమ్‌Neha Delhi Beauty Parlour Drug Case: పగలేమో మేకప్ ఆర్టిస్ట్.. రాత్రి అయితే ఈమె...

Neha Delhi Beauty Parlour Drug Case: పగలేమో మేకప్ ఆర్టిస్ట్.. రాత్రి అయితే ఈమె దారుణాలు చూడలేం బాబోయ్!

Neha Delhi Beauty Parlour Drug Case: అది ఢిల్లీ నగరం. ఆమె పేరు నేహా.. అక్కడ ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉంటుంది. పగలు మొత్తం ఆమె బ్యూటీ పార్లర్ లో మహిళలు కిటకిటలాడుతూ ఉంటారు. అందరితోను ఆమె కలుపుగోలుగా ఉంటుంది. మాట మర్యాద విషయంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె బ్యూటీ పార్లర్ కు పోలీసులు వచ్చారు. సోదాలు జరిపారు. దీంతో పార్లర్ లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బ్యూటీ […]

Neha Delhi Beauty Parlour Drug Case: అది ఢిల్లీ నగరం. ఆమె పేరు నేహా.. అక్కడ ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉంటుంది. పగలు మొత్తం ఆమె బ్యూటీ పార్లర్ లో మహిళలు కిటకిటలాడుతూ ఉంటారు. అందరితోను ఆమె కలుపుగోలుగా ఉంటుంది. మాట మర్యాద విషయంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది.

ఒకరోజు ఆమె బ్యూటీ పార్లర్ కు పోలీసులు వచ్చారు. సోదాలు జరిపారు. దీంతో పార్లర్ లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బ్యూటీ పార్లర్లోకి పోలీసులు రావడమే ఆశ్చర్యమైతే.. ఆ పార్లర్ నిర్వహించే స్నేహాన్ని అరెస్ట్ చేయడం మరింత సంచలనాన్ని కలిగించింది.

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ లో నేహాను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత పోలీసులు చెప్పిన వివరాలు స్థానికులను దిగ్బ్రాంతికి గురిచేశాయి. నేహా నడుపుతున్న బ్యూటీ పార్లర్ కేవలం ఒక ముసుగు మాత్రమేనని.. నేహా ఒక మాఫియా క్వీన్ అని పోలీసులు వెల్లడించారు. నేహా అసలు పేరు ఖుష్నమా అన్సారి. ఈశాన్య ఢిల్లీలో ఆమె ఓక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. నేహా లారెన్స్ బిష్ణోయ్, హాషీమ్ బాబా గ్యాంగ్ లు నిర్వహించే మాదకద్రవ్యాల సరఫరాలో కీలక పాత్రధారి. నేహా వద్ద భారీగా మత్తు పదార్థాల నిల్వలు పోలీసులకు దొరికాయి. ఆమె వ్యవహార శైలి చూసిన పోలీసులకు ఒక్కసారిగా మతిపోయింది. దీంతో పోలీసులు ఆమెకు మేడం జహర్ అని పేరు పెట్టారు.

ఢిల్లీలోని మహి పాలపూర్ ఫ్లైఓవర్ వద్ద ఆ మీరు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు.. ఇతర పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేహా గడిచిన ఏడు సంవత్సరాలుగా బాబీ కబూతర్ అనే చీకటి వ్యక్తితో సంబంధం కలిగి ఉంది. బాబి కబూతర్ లారెన్స్ గ్యాంగ్ కు ఆయుధాలు సరఫరా చేసేవాడు. పంజాబీ సింగర్ సిద్దు హత్య కేసులో బాబి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటి దిశ ఇంటి వద్ద కాల్పులు.. మరొక వ్యక్తి కేసులో నేహా సహచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎస్ సి ఆర్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థను నేహా తన పార్లర్ నుంచి నడిపించేదని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper