Prakash Raj: సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం పై పోలీస్ శాఖ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా సెలబ్రిటీల మీద కేసులు వేయడం మొదలు పెడితే, ఇప్పుడు ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్ పై కేసులు వేసే రేంజ్ కి ఇది వెళ్ళిపోయింది. దాదాపుగా పాతిక మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), రానా దగ్గుబాటి(Rana Daggubati) వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ తన టీం చేత ఎందుకు ఆ బెట్టింగ్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాల్సి వచ్చిందో మీడియా కి ఒక లేఖను విడుదల చేయించాడు. కాసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంపై ఒక వీడియో ద్వారా స్పందించాడు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.
అయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నేను ఒక పల్లెటూరులో సినిమా షూటింగ్ కోసం వచ్చాను. ఉదయం నుండి నేను బెట్టింగ్ గేమ్స్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు నా మీద కేసులు వేసినట్టు వార్తలు వచ్చాయి. 2016 వ సంవత్సరం లో నేను ఒక బెట్టింగ్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం వాస్తవమే. అప్పట్లో నాకు దీని గురించి పూర్తిగా తెలియదు. తెలిసిన తర్వాత ‘నాకు యాప్ ముఖ్య ఉద్దేశ్యం, దాని వల్ల జరిగే పరిణామాలు తెలియక ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నాను. మీతో సంవత్సరం పాటు కాంట్రాక్ ఉంది కాబట్టి వెంటనే ఆపమని చెప్పలేకపోతున్నాను. అగ్రిమెంట్ గడువు ముగిసిన వెంటనే ఆ యాడ్ ని ప్రసారం చెయ్యొద్దు, భవిష్యత్తులో కూడా నేను నటించను’ అని చెప్పాను. కానీ ఆ సంస్థ మరో సంస్థకి 2021 లో అమ్మేసింది. అప్పుడు సోషల్ మీడియాలో నేను గతంలో చేసిన యాడ్ ని మళ్ళీ అప్లోడ్ చేశారు’.
‘అందుకు వాళ్లకు లీగల్ నోటీసులు పంపాను. వ్యక్తిగతంగా వాట్సాప్ లో కూడా వాళ్ళతో మాట్లాడి తొలగించమని కోరాను. వాళ్ళు వెంటనే ఆపేసారు. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అందువల్లే నేను ఈ వీడియో ని చేస్తున్నాను. అందరినీ ప్రశ్నించే నేను, నా మీద నింద వచ్చినప్పుడు స్పందించకుండా ఎలా ఉంటాను. పోలీస్ శాఖ వారి నుండి నాకు ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం కచ్చితంగా వాళ్లకు విచారణ కోసం సహకరిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. అయితే దీనిపై నెటిజెన్స్ మాత్రం శాంతించడం లేదు. ఇంత వయస్సు వచ్చింది, బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియక ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నావా?, నీ కహానీలు పోలీస్ వాళ్లకు చెప్పు నమ్ముతారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రకాష్ రాజ్ పోలీస్ విచారణకు పిలిస్తే హాజరు అవుతాడా లేదా అనేది.
My response #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls
— Prakash Raj (@prakashraaj) March 20, 2025