Kamindu Mendis: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఓ బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ వేసాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. పైగా అతడు వికెట్ కూడా సాధించాడు. అత్యంత పొదుపుగా బంతులు వేశాడు. తోటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే.. అతడు మాత్రం పదునైన బంతులు వేస్తూ.. పిచ్ పై వైవిధ్యాన్ని రాబట్టాడు. అంతేకాదు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో అతడు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతున్నాడు. రెండు చేతులతో బౌలింగ్ వేసి దిగ్గజ బౌలర్లతో సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు.. ఐపీఎల్ లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. 80 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.. దీంతో పాయింట్లు పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా చివరి స్థానానికి పడిపోయింది.. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టుకు ఇదే అత్యంత దారుణమైన ఓటమి. గత ఏడాది చెన్నై జట్టుతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 77 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read: ఎస్ఆర్హెచ్ టీం.. ఆటగాళ్లవి అడ్డిమారి గుడ్డిదెబ్బలే!
అద్భుతంగా బంతులు వేశాడు
గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక పార్ట్ టైం బౌలర్ కామిందు మెండీస్(kamindu Mendis) అద్భుతం చేశాడు..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున బౌలింగ్ వేసిన అతడు అందరిని ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురిచేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ అద్భుతం చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ ఒక్కసారిగా కామిందు మెండీస్(kamindu Mendis) కు బౌలింగ్ చి ఆశ్చర్యానికి గురిచేసాడు. అయితే అతడు రెండు చేతులతో బౌలింగ్ వేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్ రెండు చేతులతో ఒకే విధంగా ఉంటుంది.. ఇక ఈ మ్యాచ్లో ఒక ఓవర్ మాత్రమే వేసిన కామిందు మెండీస్(kamindu Mendis).. నాలుగు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రఘు వంశీ వికెట్ పడగొట్టాడు.. తద్వారా రెండు చేతులతో బౌలింగ్ వేసి వికెట్ సాధించిన బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు. అతడు రైట్ హ్యాండ్ బ్యాటర్లకు అతను లెఫ్ట్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేశాడు. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేశాడు. అయితే ఇతడికి తదుపరి మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో స్థానం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాట్ ద్వారా మెండిస్ 27 పరుగులు కూడా చేశాడు..
KAMINDU MENDIS BOWLING WITH BOTH HANDS IN IPL pic.twitter.com/fLbM1NUK4u
— Johns. (@CricCrazyJohns) April 3, 2025