Donald Trump (6)
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump)బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలతో అమెరికన్లను.. ఆ దేశంలో స్థిరపడిన వారిని టెన్షన్ పెడుతున్నారు. ప్రపంచ దేశాలసై సుంకాల మోత మోగించారు. ఇక జన్మతః సిటిజన్‌షిప్‌ను రద్దు చేశారు. గ్రీన్‌కార్డు(Green Card)లో శాశ్వత సభ్యత్వం రాదని ప్రకటించారు. వాటి స్థానంలో గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు.
Also Read: సుప్రీం కోర్టు తీర్పు.. HCUలో సంబురాలు!
అమెరికా పౌరసత్వం కోరుకునే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ‘గోల్డ్ కార్డ్’(Gold Card) పథకాన్ని ప్రకటించారు. తాజాగా, ఎయిర్ ఫోర్స్ వన్(Airforce-1)లో విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్డు ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు. ట్రంప్ చిత్రంతో అలంకరించిన ఈ గోల్డ్ కార్డ్‌ను 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.5 కోట్లు) చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తానే మొదటి కార్డును సొంతం చేసుకున్నానని, రెండో కార్డు కొనేవారు ఎవరో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రెండు వారాల్లో ఈ కార్డులు అమ్ముడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా(EB-5 Investar Visa)విధానాన్ని రద్దు చేసి, గోల్డ్ కార్డ్‌ను ప్రవేశపెట్టారు.
కార్డు కొంటే పౌరసత్వం..
గోల్డ్ కార్డు కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వం(America citizenship) లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు ఈ చర్య తీసుకున్నామని ట్రంప్ వివరించారు. వీరు అమెరికా(America)లో భారీగా ఖర్చు చేస్తే స్థానిక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, ఒక్క రోజులోనే 1000 కార్డులు విక్రయించామని, దీని ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించామని తెలిపారు. ప్రపంచంలో 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందని ఆయన అంచనా వేశారు.
ఈబీ–5 విసా రద్దు..
ఈబీ–5 వీసా విధానం 1990లో అమెరికాలో ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా వేలాది మంది ఇన్వెస్టర్ వీసాలు పొందారు. అయితే, ఈ విధానంలో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. దీంతో 2022లో సవరణలు చేశారు. ఈ నేపథ్యంలో గోల్డ్ కార్డ్‌ను తీసుకొచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డు చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడంతో పాటు మోసాలను అరికడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పథకం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సంపన్న వలసదారులను ఆకర్షించాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ గోల్డ్ కార్డ్ అమెరికా పౌరసత్వానికి సరళమైన మార్గంగా మారనుంది.
Trump shows journalists a gold card featuring his face: “For $5 million this could be yours”
He does this on the very day the market wipes out $2.6 trillion in value,while millions of Americans fear for their jobs amid a looming recession. So out of touchpic.twitter.com/ZpFZP4PK6n
— Republicans against Trump (@RpsAgainstTrump) April 3, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Donald trump us gold card photo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com