https://oktelugu.com/

Ritu Varma: బోల్డ్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్.. తెలుగు హీరోయిన్ బిజినెస్ ట్రిక్ !

Ritu Varma: రీతూ వర్మ అచ్చ తెలుగు బ్యూటీ అని తెలుగు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే, తెలుగు హీరోయిన్ అంటే.. తెలుగులో స్టార్ డమ్ రాదు అనే విషయం బయట జనానికి పెద్దగా తెలియదు. అందుకే, హీరోయిన్ తెలుగు అమ్మాయి అనగానే, తెలుగు హీరోయిన్ అంటూ ఆ హీరోయిన్ కి ఓవర్ పబ్లసిటీ చేస్తారు. దాంతో ఆ హీరోయిన్ పేరు చెప్పగానే.. దర్శకులు తెలుగు అమ్మాయి కదా, వద్దులే. ముంబై అమ్మాయిని పెట్టుకుందాం అంటూ […]

Written By:
  • admin
  • , Updated On : September 9, 2021 / 03:09 PM IST
    Follow us on

    Ritu Varma: రీతూ వర్మ అచ్చ తెలుగు బ్యూటీ అని తెలుగు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే, తెలుగు హీరోయిన్ అంటే.. తెలుగులో స్టార్ డమ్ రాదు అనే విషయం బయట జనానికి పెద్దగా తెలియదు. అందుకే, హీరోయిన్ తెలుగు అమ్మాయి అనగానే, తెలుగు హీరోయిన్ అంటూ ఆ హీరోయిన్ కి ఓవర్ పబ్లసిటీ చేస్తారు. దాంతో ఆ హీరోయిన్ పేరు చెప్పగానే.. దర్శకులు తెలుగు అమ్మాయి కదా, వద్దులే. ముంబై అమ్మాయిని పెట్టుకుందాం అంటూ తెలుగు హీరోయిన్స్ పక్కన పెట్టేస్తూ ఉంటారు.

    అందుకే, రీతూ వర్మ తెలుగు హీరోయిన్ అయినా, తానూ తెలుగు హీరోయిన్ ను కాదు అంటుంది. అదేంటి, తెలుగు చక్కగా మాట్లాడుతుంది కదా. పైగా పుట్టింది, పెరిగింది కూడా హైదరాబాద్ లోనే కదా, మరి తెలుగు అమ్మాయి కాదు అని ఎందుకు చెబుతుంది అంటే.. కారణం.. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు వస్తోన్న అవకాశాలు చూసే. అందుకే, సింపుల్ గా తమ మూలాలు నార్త్ లో ఉన్నాయి అని రీతూ వర్మ చెబుతూ.. తనను తానూ నార్త్ అమ్మాయిగా ప్రమోట్ చేసుకుంటుంది. మొత్తానికి ఈ తెలుగు హీరోయిన్ కొత్త బిజినెస్ ట్రిక్ ను ప్లాన్ చేస్తోంది.

    తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఉత్తరాది నుంచి ఇక్కడికి వలస వచ్చింది. అంతేగాని మేము తెలుగు వాళ్ళం కాదు. అయితే, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. అందుకే, అందరూ నన్ను పక్కా తెలుగమ్మాయిలా చూస్తూ ఉంటారు. కాకపోతే నేను నార్త్ అమ్మాయిని. ఇప్పటికి మా ఇంట్లో నార్త్ కల్చరే’ అని చెప్పుకొచ్చింది. అలాగే, ఈ భామ చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగిందట. అన్నట్టు తెలుగు చిత్రాలు కూడా చాలా తక్కువగా చూస్తోందట.

    ఇక ఈ భామ రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ చేయడానికి కమిట్ అయింది. కేవలం అమెజాన్ ప్రైమ్ కోసం మాత్రమే ఈ వెబ్‌ సిరీస్‌ ఓకే చేశాను అని, త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అని చెప్పింది. మరి వెబ్ సిరీస్ అంటే గ్లామర్ ఒలకబోయాల్సి ఉంటుంది. అలాగే బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా నటించాల్సి ఉంటుంది కదా అంటే.. ? “గ్లామర్ పాత్రలకు తనకు బాగా ఇష్టం అని క్లారిటీ ఇచ్చింది రీతూ.