Rishab Shetty Jai Hanuman Remuneration: ఈమధ్య కాలం లో సినీ హీరోల రెమ్యూనరేషన్స్ నిర్మాతలకు ఏ రేంజ్ లో భారం అవుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 300 కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టి ఒక పాన్ ఇండియన్ సినిమాలని తియ్యాలని అనుకుంటే , అందులో హీరో రెమ్యూనరేషనే 150 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఆ రేంజ్ రెమ్యూనరేషన్స్ తీసుకోవడం వల్ల, మేకర్స్ తమపై పడే భారాన్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారు. ఫలితంగా సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అయితే కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన రిషబ్ శెట్టి , ప్రస్తుతం హీరో గా నటిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ పారితోషికం విషయం లో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రశంసల వర్షం కురిసేలా చేస్తోంది. పూర్తి వివరాలను ఒకసారి వివరంగా ఈ కథనం లో చూద్దాం పదండి.
‘జై హనుమాన్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ నిర్మాతలు హీరో రిషబ్ శెట్టి ఎదుట రెమ్యూనరేషన్ విషయం లో రెండు ఛాయస్ లు ఇచ్చారు. ఒకటి 30 కోట్ల రూపాయిల నికర రెమ్యూనరేషన్ , రెండు 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ + లాభాల్లో వాటాలు. హీరో రిషబ్ శెట్టి రెండవ ఛాయస్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి ఆయన రెమ్యూనరేషన్ 20 కోట్లు మాత్రమే, ఒకవేళ సినిమా సూపర్ హిట్ గా నిలిచి, 600 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబడితే మాత్రం రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ 150 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ కంటే ఎక్కువ అన్నమాట. కానీ ఫ్లాప్ అయ్యి నష్టాలు వస్తే మాత్రం రిషబ్ శెట్టి కేవలం 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకోవాల్సిందే.
మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో దగ్గుబాటి రానా విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ హంపీ లో మొదలైంది. ఈ ఏడాది లోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.
