Shyam Singaroy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ గా రూపొందుతుంది. ఇటీవల ఈ మూవీ కి సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను నవంబర్ 6 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సాంగ్ ప్రోమో ను మూవీ యూనిట్ విడుదల చేసింది.
‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ సాగిన ఈ పాటలో హీరో క్యారెక్టర్ ను వర్ణిస్తున్నట్లు ఉంది. ఈ ప్రోమోలో 1970 కలకత్తా అని ఓ టైటిల్ వేశారు. అంటే శ్యామ్ సింగరాయ్ గతానికి సంబంధించిన పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇక సినిమాలో మొదటి పాటను కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా… మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లను గమనిస్తే.. ఈ సినిమా పూర్వజన్మలకు సంబంధించిన కాన్సెప్ట్ మాదిరి అనిపిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ తో అయిన మంచి హిట్ సాధించాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు.
Here’s the promo of the first lyrical from #ShyamSinghaRoy 🙂#RiseOfShyam
Go for full volume this time 🔥Telugu,Tamil,Malayalam,Kannada pic.twitter.com/2n3Cimxhla
— Nani (@NameisNani) November 2, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rise of shyam song promo released from shyam singaroy movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com