https://oktelugu.com/

RGV: నాగార్జున చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ఆర్జీవీ…

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోతరంలో ఒక్కో ట్రెండ్ సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులో అభిరుచి అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి దర్శకులు వాళ్ళ అభిరుచి మేరకు సినిమాలను చేస్తూ ముందుకు సాగితే సినిమాలు సక్సెస్ అవుతాయనే చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో మూస ధోరణి కథలకు రామ్ గోపాల్ వర్మ ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు. దానివల్లే ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాలు సక్సెస్ ఉన్నా లేకపోయిన దర్శకుడిగా సర్వైవల్ అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 01:30 PM IST

    Senior RGV

    Follow us on

    RGV: సినిమా ఇండస్ట్రీలో శివ సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నాగార్జున మొదటిసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఈ సినిమాని సక్సెస్ చేసిన విధానం అద్భుతమనే చెప్పాలి. అయితే రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమాతోనే పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణి లో సాగుతున్న కథలను పటాపంచలు చేస్తూ మాఫియా టైప్ ఆఫ్ స్టోరీస్ కి ఆజ్యం పోశాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పటివరకు దిగ్విజయంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే నాగార్జున ఆర్జీవి కాంబోలో వచ్చిన ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా వీళ్లను ఓవర్ నైట్ లో స్టార్లుగా మార్చింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరూ కలిసి ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోనప్పటికి శివ సినిమా మాత్రం వీళ్ళ కెరియర్లో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ సాధించిన విజయాల్లో ఇది అత్యుత్తమమైన విజయమనే చెప్పాలి. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అవుతూ నాగార్జున నాకు లైఫ్ ని ఇచ్చాడు అంటూ వర్మ చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి.

    నిజానికి వర్మ ఏ విషయంలోను పెద్దగా ఎమోషనల్ అయితే అవ్వడు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఎమోషనల్ అయ్యాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆర్జీవి తనదైన రీతిలో సినిమాలు చేయకుండా నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ప్రేక్షకులు ఈ సినిమాలను చూస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పుడు నాగార్జునతో మరో సినిమా చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి నాగార్జున ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆర్జీవికి డేట్స్ ని ఇస్తాడా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

    ఎందుకంటే ఇంతకుముందు ఆఫీసర్ అనే ఒక సినిమా చేసి నాగార్జునకు భారీ డిజాస్టర్ ను కట్టబెట్టిన వర్మ ఇప్పుడు చేయబోయే సినిమాతో మరోసారి ప్లాప్ ను ఇస్తాడనే ఉద్దేశ్యంలో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నాగార్జున ఈ సబ్జెక్టుని వీలైనంత వరకు చేయకపోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి…