https://oktelugu.com/

Allu Arvind And Dil Raju: అల్లు అరవింద్, దిల్ రాజు ఈ ఇద్దరిలో ఎవరు టాప్ ప్రొడ్యూసర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో హీరోలు మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నారు. నిజానికి ఒక సినిమా తెరకెక్కలంటే దానికి ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కీలకం... అలాంటి ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అనేది తెరకెక్కడం చాలా కష్టంతో కూడుకున్న పని...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 1:34 pm
    Allu Arvind And Dil Raju

    Allu Arvind And Dil Raju

    Follow us on

    Allu Arvind And Dil Raju: అల్లు రామలింగయ్య కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రొడ్యూసర్ గా మారిన అల్లు అరవింద్.. ఆ తర్వాత చిరంజీవితో వరుస సినిమాలను నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ముఖ్యంగా చిరంజీవికి కెరియర్ లో ఉన్న సక్సెస్ ఫుల్ సినిమాలన్నీ గీత ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించినవే కావడం విశేషం… ఇక గీతా ఆర్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సక్సెస్ అవ్వడమే కాకుండా టాప్ ప్రొడ్యూసర్ గా కూడా అల్లు అరవింద్ ఇప్పటివరకు కొనసాగుతున్నాడు అంటే నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మొదట చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన దిల్ రాజు కూడా ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను టాప్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న సగం మంది స్టార్ హీరోల డేట్స్ తన దగ్గరే ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి టాప్ పొజిషన్ ను కైవసం చేసుకున్న దిల్ రాజు తన మార్కెట్ స్ట్రాటజీని విస్తరిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవ్వడమే కాకుండా ఆ సినిమా మినిమం గ్యారంటీ అనే ఒక మార్కును తగిలించుకొని వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరికి దక్కని గౌరవప్రదమైన పొజిషన్ ని అందుకున్నాడనే చెప్పాలి. ఇక ఒకప్పుడు గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లు ఇండస్ట్రీలో చక్రం తిప్పాయి.

    కానీ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయనే చెప్పాలి. ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన దిల్ రాజు మొదట్లో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత తను కమర్షియల్ సినిమాలు చేసి భారీ సక్సెస్ లు సాధించాడు. ముఖ్యంగా ఏ సినిమా ఆడుతుంది.

    ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనేది ఆయన ముందుగానే గెస్ చేస్తాడు. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలపాటు టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…

    ఇక ఈ సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ఈ రెండు సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…