RGV: రామ్ గోపాల్ వర్మ సినిమాలకు పవన్ కళ్యాణ్ పెట్టుబడిలా మారిపోయాడు. ఆయన ఇమేజ్, పాపులారిటీ, ఫ్యాన్స్ ఎమోషన్స్ ముడిసరుకుగా చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. వాళ్ళ కోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. పవన్ పై వివాదస్పద చిత్రాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకొని పబ్బం గడుపుతున్నాడు. చాలా కాలంగా ఇదే పంథా ఫాలో అవుతున్న వర్మ… మరో వివాదాస్పద చిత్రంతో పవన్ ని కెలికే ప్రయత్నం చేస్తున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ వైఫల్యాలపై వర్మ సెటైరికల్ గా ‘పవర్ స్టార్’ పేరుతో ఓ మూవీ చేశారు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసి ఓడిపోగా.. తన వైఫల్యానికి కారణాలను, ఓటమి తరువాత పవన్ అనుభవించిన మానసిక వేదనను స్పూఫ్ రూపంలో, అభ్యంతరకర సన్నివేశాలతో పవర్ స్టార్ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. మూవీ విడుదల ఆపివేయాలని.. వర్మ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది.
అప్పటి పరిస్థితుల నేపథ్యంలో పవర్ స్టార్ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశాడు వర్మ. కొన్నాళ్లుగా పవన్ జోలికి వెళ్లని వర్మ… తాజాగా మరోసారి రచ్చ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీని, నారా లోకేష్ ని వివాదంలోకి లాగుతూ… ‘ఆర్జీవీ మిస్సింగ్’ మూవీ ట్రైలర్ విడుదల చేశాడు. తమ వ్యక్తిత్వం దెబ్బతీసేలా సినిమాలు తీసిన వర్మను మెగా ఫ్యామిలీ లేదా పవన్ ఫ్యాన్స్ కిడ్నాప్ చేశారనే నేపథ్యం కలిగి ఉంది ఈ మూవీ ట్రైలర్. పవర్ స్టార్ సినిమాకు ఇది సీక్వెల్ అని క్లియర్ గా అర్థం అవుతుంది.
Also Read: Television to silver screen heroes: బుల్లితెర టూ వెండితెరకు వెళ్లిన హీరోలు వీరే!
వర్మను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పాల్ లను విచారించడానికి స్పెషల్ ఆఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దిగాడు. ఆర్జీవీ మిస్సింగ్ మూవీ ద్వారా పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కాగా వర్మ తాజా చిత్రం ఎన్ని వివాదాలకు కేంద్ర బిందుకు కానుందో అనే సందేహాలు మొదలయ్యాయి.
Also Read: Actress keerthi Suresh: ఆ స్పెషల్ మూవీకి ఒకే చెప్పిన కీర్తి సురేశ్… నిర్మాతలుగా నటి అమ్మానాన్నలు