https://oktelugu.com/

Shyam Singha Roy: ‘శ్యామ్​సింగరాయ్’ స్టోరీ ఇదేనా.. రివీల్​ చేసిన నాని!

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఈ సినిమా విడుదలకు దగ్గరవుతున్న నేపథ్యంలో.. నాని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 11:36 AM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఈ సినిమా విడుదలకు దగ్గరవుతున్న నేపథ్యంలో.. నాని వరుసగా మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ప్రశ్నించగా.. చెప్పచ్చో లేదో అంటూనే పలు ఆసక్తికర విషయాలు చెప్పేశాడు నాని. ఈ క్రమంలోనే శ్యామ్​సింగరాయ్​ స్టోరీని రివీల్​ చేసేశాడు.

    నాని మాట్లాడుతూ.. బెంగాలీ అమ్మాయి, తెలుగు కుర్రాడి కథను శ్యామ్​ సింగరాయ్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్​లో అదే నిజమైంది. ఇందులో బెంగాలీ డైలాగ్​ ఉండటంతో ఈ వార్తు మరింత బలం చేకూరినట్లైంది. అయితే, టీజర్​లో మాత్రమే బెంగాళీ ఉందా.. లేక ప్లాష్​బాక్​ ఎపిసోడ్​ మొత్తం ఈ బెంగాలీ ప్రభావం కనిపిస్తుందా తెలియాల్సి ఉంది.

    నాని, సాయిపల్లవి కలకత్తాలోని ఓ బెంగాలీ జంటగా ఈ సినిమాలో నటించారు.  దేవదాసీ సంప్రదాయాన్ని వ్యతిరేకించే వ్యక్తులుగా హీరోహీరోయిన్లు కన్పించబోతున్నారు. ఇందులో సాయి పల్లవి దేవదాసీగా కన్పించగా, నాని మాత్రం జర్నలిస్ట్ గా కన్పించబోతున్నారు. కాగా, డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో ఎలాగైన సూపర్​ హిట్​ కొట్టాలని నాని బలంగా కోరుకుంటున్నారు.