Homeఎంటర్టైన్మెంట్fariya abdullah: ఐటెం సాంగ్స్​తో అలరించేందుకు 'జాతిరత్నాలు' బ్యూటీ రెడీ!

fariya abdullah: ఐటెం సాంగ్స్​తో అలరించేందుకు ‘జాతిరత్నాలు’ బ్యూటీ రెడీ!

fariya abdullah: తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని.. తన నటన, అందంతో మెప్పించిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్​గా నటించిన ఈ అందాల తార.. ఈ సినిమాతో టాలీవుడ్​లో అభిమానులను సొంతం చేసుకుంది. అయితే, ఫరియాలో కేవలం నటిమాత్రమే కాదు, మంచి డాన్సర్​ కుడా ఉన్నారు. తన ఇన్​స్టాగ్రామ్​లో ఎప్పటికప్పుడు యాక్టీవ్​గా ఉంటూ.. డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే అభిమానులను అలరిస్తుంటుంది.

fariya abdullah

కాగా, జాతిరత్నాలు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వా ఏ సినిమాలకు ఓకే చెప్పలేదు. తాజాగా, ఈ బ్యూటీ నెక్ట్స్ సినిమాపై ఓ ఇంట్రస్టింగ్ అపడేట్ వచ్చింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఢీ అంటే ఢీ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డిసెంబరులో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభం కానుంది. అయితే, ఇందులో ఐటెం  పాటకు ఫరియా అబ్దుల్లా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే కింగ్​ నాగార్జునతో కూడా ఓ ఐటెం సాంగ్​లో స్టెప్పులేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున నటిస్తునన్న బంగార్రాజు సినిమాలో ఫరియా స్పెషల్​సాంగ్​తో అలరించనుందట. వచ్చే నెలలోనే ఈ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య హీరోలు కాగా.. కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్​లుగా నటిస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి.  ప్రస్తుతం తండ్రికొడుకులిద్దరూ బంగార్రాజు షూటింగ్​లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు, నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. 2022లోనే ఈ సినిమా కూాడా విడుదల కానుంది. ఇక నాగచైతన్య కూడా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version