https://oktelugu.com/

ఆర్జీవీ డెన్ : అది ఇల్లా? లేక అడవినా?

ఆర్జీవీ సినిమాలే కాదు వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఆయన ఇల్లు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2024 / 04:01 PM IST

    RGV Den

    Follow us on

    RGV DEN:ఇండియన్ సినీ చరిత్రలో రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా ఉంటారు. నలుగురికి నచ్చనిది.. తనకు నచ్చుతుంది.. అన్నట్లుగా మిగతా డైరెక్టర్ల కంటే భిన్నంగా సినిమాలు తీస్తూప్రత్యేకంగా నిలుస్తుంటారు. యదార్థ ఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించే ఆర్జీవీ లేటేస్టుగా ఏపీ రాజకీయాల నేపథ్యంలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తీసి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్జీవి గురించి ఓ టాపిక్ ఆసక్తిగా మారింది. అదే ఆర్జీవీ డెన్ గురింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా..

    తెలుగువాడే అయినా రాంగోపాల్ వర్మకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ శివ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడనే చెప్పాలి. కేవలం సెలెక్టెడ్ కథలతో చిత్రాలు తీస్తూ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఆయన లేటేస్ట్ గా తీసిన వ్యూహం, శపథం చిత్రాలపై కోర్టు కేసులు అయ్యాయి. అయినా ఏమాత్రం బెదరకుండా వాటిని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

    ఈ తరుణంలో ఆర్టీవి డెన్ గురించి హాట్ టాపిక్ అయింది. ఆర్జీవీ సినిమాలే కాదు వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఆయన ఇల్లు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్లుగానే మిగతా ఇళ్ల కంటే ఇది పూర్తిగా విభిన్నం. ఎందుకంటే ఇందులోకిఎంట్రీ ఇస్తే ఇంట్లోకి కాకుండా అడవిలోకి వెళ్లినట్లు ఉంటుంది. ఎందుకంటే ఆర్టీజీ డెన్ లో మొత్తం చెట్లు ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనంకనిపిస్తుంది. చెట్లు, తీగల మధ్య ఆయనకు సంబంధించిన ఫొటోలు దర్శనమిస్తాయి.

    అయితే ఈ ఫొటోలు ఆయన ఫ్యామిలీవో లేక ఇంకెవో సీనరీస్ కు సంబంధించినవి కావు. ఆర్జీవీ సినీ జీవితంలో ప్రముఖ నటులు, హీరోయిన్లతో కలిసి ఉన్న ఫొటోలు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కొన్నిహీరోయిన్లకు సంబంధించిన హాట్ ఫొటోస్ కూడా దర్శనమిస్తాయి. అంటే ఈ డెన్ లోకి వెళితే నిజంగానే ఒక డెన్ లోకి వెళ్లిన ఫీల్ అవుతారు. ఆ డెన్ లోకి వెళితే ఒక కొత్త లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మరి ఆ వీడియో మీరు కూడా చూసేయండి..