https://oktelugu.com/

IAS Govind Jaiswal: రిక్షా తొక్కేవాడి కొడుకు ఐఏఎస్‌..ఈ సక్సెస్‌ స్టోరీ వింటే గూస్ బాంబ్సే

గోవింద్‌ జైశ్వాల్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవాడు. ఇతని తండ్రి నారాయణ జైశ్వాల్‌. మొదట ఒక రేషన్‌సాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 23, 2024 / 03:56 PM IST

    IAS Govind Jaiswal

    Follow us on

    IAS Govind Jaiswal: యాక్టర్‌ కొడుకు యాక్టర్‌.. డాక్టర్‌ కొడుకు డాక్టర్‌.. కలెక్టర్‌ కొడుకు కలెక్టర్‌.. పోలీస్‌ ఆఫీసర్‌ కొడుకు పోలీస్‌ కావడం సాధారణం. వారికి రూట్‌ తెలిసి ఉంటుంది. శిక్షణ ఇప్పించే ఆర్థిక శక్తి ఉంటుంది. ఇందులో కొత్తదం ఏమీ ఉండదు. కానీ, ఓ రిక్షా తొక్కేవాడి కొడుకు ఐఏఎస్‌ అయితే ఎలాంటుంది.. ఇది కదా అసలు కిక్‌ అనిపిస్తుంది కదా. కానీ, అలా సాధించాడు ఈ రిక్షా తొక్కే నారాయణ్‌జైశ్వాల్‌ కొడుకు గోవింద్‌ జైశ్వాల్‌.. కార్మికుడి కొడుకుగా అవమానాల్ని, అవహేళనలు ఎదుర్కొన్నాడు. అందులో నుంచి పుట్టిన ఆలోచననే తన సక్సెస్‌కు మెట్లుగా మార్చుకున్నాడు. ఒక్కో మెట్లు ఎక్కుతు ఐఏఎస్‌ అయ్యాడు.

    వారణాసికి చెందిన రిక్షావాలా..
    గోవింద్‌ జైశ్వాల్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవాడు. ఇతని తండ్రి నారాయణ జైశ్వాల్‌. మొదట ఒక రేషన్‌సాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోకుండా ఆ షాప్‌ మూతపడింది. దీంతో ఉపాధి కోల్పోయాడు. తనదగ్గర ఉన్న కొన్ని డబ్బులతో రిక్షాలు కొనుగోలు చేశాడు. వాటిని అద్దెకు ఇస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించాడు.

    భార్య మరణంతో..
    ఇంతలో నారాయణ జైశ్వాల్‌ భార్య అనారోగ్యంపాలైంది. చికిత్స కోసం ఉన్న రిక్షాలను అమ్మేశాడు. అయినా దురదృష్టవశాత్తు 1995లో ఆమె మరణించింది. దీంతో నారాయణ జైశ్వాల్‌ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కష్టపడి ఆడ పిల్లల పెళ్లి చేశాడు. ఒక్కగానొక్క కొడుకును చదివించేందుకు రిక్షా తొక్కడం ప్రారంభించాడు.

    గోవింద్‌కు అవమానాలు..
    అయితే నారాయణజైశ్వాల్‌ కొడుకును అతని స్నేహితుల కుటుంబ సభ్యులు రిక్షావాలా కొడుకుగా చూసేవారు. అవమానించేవారు. తమ కుమారులతో స్నేహం చేయవద్దని వారించేవారు. దురుసుగా ప్రవర్తించేవారు. ఈ అవమానాలు, అవహేళనలే గోవింద్‌ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలాగైనా గౌరవంగా బతకాలని నిర్ణయించుకున్నాడు.

    కలెక్టర్‌ అవుతానని..
    తాను పడిన అవమానాలను గోవింద్‌ తండ్రికి చెప్పేవాడు కాదు. కానీ ఒకరోజు తాను కలెక్టర్‌ అవుతానని తండ్రి నారాయణ్‌జైశ్వాల్‌కు చెప్పాడు. కొడుకుపై నమ్మకం ఉన్న తండ్రి.. కాదనలేదు. కష్టపడి రూ.40 వేలు తెచ్చి గోవింద్‌కు ఇచ్చాడు. వాటిని తీసుకుని ఢిల్లీ వెళ్లాడు గోవింద్‌. అక్కడ కోచింగ్‌ తీసుకుంటూ.. రోజువారి ఖర్చులకు పార్ట్‌టైం జాబ్‌ చేసేవాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు.

    తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌..
    ఖర్చుల కోసం పనిచేస్తూనే గోవింద్‌ తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మరువలేదు. 2006లోఓ తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో యూపీఎస్‌సీలో 48వ ర్యాంకు సాధించాడు. తాను అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. మొదట గోవాలో స్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రెటరీగా పనిచేశాడు. గోవింద్‌ భార్య చందన ఐపీఎస్‌. వీరికి కుమారుడు ఉన్నాడు.

    గోవిండ్ బయోపిక్‌..
    గోవింద్‌ జైశ్వాల్‌ జీవితం ఆధారంగా కమల్‌ చంద్ర దర్శకత్వంలో ‘అబ్‌ దిల్లీ దూర్‌ నహీ’ సినిమా తెరకెక్కబోతోంది. 12్టజి ఫెయిల్‌ తరహాలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. మొత్తంగా గోవింద్‌ జైశ్వాల్‌ జీవితం డబ్బు లేదు. తల్లిదండ్రులు ఏమీ సంపాదించలేదు అనే ఎంతో మందికి యువతీ యువకులకు స్ఫూర్తిదాయకం.