Retro Collection: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ అంచనాలు భారీ గా ఉండడం వల్ల ఓపెనింగ్స్ వరకు పర్వాలేదు అనిపించింది. రెండవ రోజు కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్స్ ని చూసి కంగువా కంటే పెద్ద డిజాస్టర్ అవుతుందని బయ్యర్స్ భయపడ్డారు. కానీ రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ చిత్రం. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లో 37 శాతం రికవరీ ని సంపాదించింది. డొమెస్టిక్ మార్కెట్ లో మంచి వసూళ్లనే రాబడుతుంది కానీ, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం.
Also Read: ఆ కారు యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది : హీరో నాని
కనీసం అక్కడ రోజుకి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రావడం లేదు. మొదటి రోజు ఎక్కడైతే ఆగిందో, అక్కడే ఈ సినిమా ఇప్పటికీ ఉంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు 11 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, మూడవ రోజు ఏకంగా 14 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు వచ్చిన టాక్ కి ఇంత భారీ జంప్ ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 3 రోజుల్లో 61 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫ్లాప్ టాక్ తో ఈమాత్రం వచ్చిందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండవ రోజుతో పోలిస్తే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు 48 లక్షలు రాగా, మూడవ రోజు 53 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా చూస్తే తమిళనాడు నుండి 28 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 90 లక్షలు, కర్ణాటక నుండి 8 కోట్ల 80 లక్షలు, కేరళ నుండి 3 కోట్ల 40 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 90 లక్షలు, ఓవర్సీస్ నుండి 14 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 61 కోట్ల రూపాయిల గ్రాస్ కి గానూ, 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లాలంటే మరో 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఆ రేంజ్ లో ఈ సినిమా వసూళ్లను సొంతం చేసుకుంటుందా లేదా అనేది రేపటి కలెక్షన్స్ తో తెలుస్తుంది.
Also Read: ‘హిట్ 3’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సడన్ గా పడిపోయిందిగా..కారణం ఏమిటంటే!