Court Movie: ఈ ఏడాది కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడమే కాకుండా, క్రిటిక్స్ నుండి అద్భుతమైన రేటింగ్స్ ని తెచ్చుకున్న చిత్రం ‘కోర్ట్'(Court Movie). నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ కోర్ట్ చిత్రం లో హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రియదర్శి ఇందులో లాయర్ పాత్రలో అద్భుతంగా నటించి, మంచి మార్కులు కొట్టేసాడు. కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, ఏకంగా ‘చావా’ ని కూడా డామినేట్ చేసి సెన్సేషన్ సృష్టించింది. గత వారం ఎన్నో సినిమాలు నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చాయి, కానీ కోర్ట్ చిత్రాన్ని మాత్రం డామినేట్ చేయలేకపోయాయి. చూస్తుంటే ఓటీటీ లో కూడా ఈ చిత్రం సెన్సేషన్ అయ్యేలా ఉంది.
Also Read: రెట్రో’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..మూడవ రోజు పుంజుకుంది..కానీ ఇది సరిపోదా?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రియదర్శి(Priyadarshi) చేసిన క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అతిశయం లేకుండా, మనం రెగ్యులర్ గా కోర్ట్స్ లో చూసే లాయర్లు ఎలా ఉంటారో, అంతే సహజం గా ఈ చిత్రం లో నటించాడు. కచ్చితంగా ఆయన నటనకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రియదర్శి క్యారక్టర్ కి ముందుగా వేరే హీరో ని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు, శ్రీ విష్ణు(Srivishnu). నాని కి అత్యంత సన్నిహితుడైన శ్రీవిష్ణు ని సంప్రదిస్తే బాగుంటుందేమో అని నాని డైరెక్టర్ తో అన్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం ఎందుకో ఈ క్యారక్టర్ కి ప్రియదర్శి ఇంకా గట్టి న్యాయం చేస్తాడేమో అని అనిపిస్తుందని చెప్పాడట. ఇక డైరెక్టర్ ఛాయస్ కి నాని కూడా సుముఖత చూపడం తో ప్రియదర్శి కి ఈ క్యారక్టర్ వరించింది.
ఒకవేళ శ్రీవిష్ణు చేసి ఉంటే ఆయన కెరీర్ కి పెద్ద బ్రేక్ దొరికేది. ‘సామజవరగమనా’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు ‘స్వాగ్’ చిత్రం చేసాడు. ఇది కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ ఆ సినిమా కాకుండా ‘కోర్ట్’ చిత్రం చేసి ఉండుంటే, కచ్చితంగా శ్రీవిష్ణు మార్కెట్ బాగా పెరిగేది. అంతే కాకుండా శ్రీవిష్ణు ఎక్కువగా కామెడీ టైమింగ్ ఉన్న రోల్స్ ద్వారానే క్రేజ్ ని తెచ్చుకున్నాడు. కోర్ట్ చిత్రం చేసి ఉంటే ఆయనకు కంటెంట్ పరంగా కొత్త ప్రయోగం కూడా చేసినట్టు అయ్యేది, తనలోని టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసేది. అంతకు ముందు శ్రీ విష్ణు సీరియస్ రోల్స్ చేసాడు కానీ, అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.