Renu Desai: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో రేణు దేశాయ్(Renu Desai) విడాకులు తీసుకున్న తర్వాత నుండి ఆమె ఎప్పుడు పవన్ ని టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయనతో నేను ఎన్నో ఏళ్ళు కాపురం చేసాను, నా విషయం లో అన్యాయం జరిగింది అనుకోవచ్చు, కానీ జనాలకు సేవ చెయ్యాలనే తపన ఆయన లో ఉన్నది నిజం. అందుకు నేనే సాక్షి అంటూ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి ఇంత గొప్పగా మాట్లాడే రేణు దేశాయ్, ఆయన అభిమానుల గురించి మాత్రం అనేక సందర్భాల్లో నోరు జారింది. అది పాజిటివ్ గా పెట్టినా నెగిటివ్ గా పెట్టినా, ఆమె నుండి మాత్రం రియాక్షన్ నెగిటివ్ గానే వస్తుంది. మాట్లాడే వాళ్ళు వంద మాట్లాడుకుంటారు, మన పని మనం చేసుకుంటూ పోదాం అని అనుకునే రకం కాదు ఈమె, చాలా సున్నితమైన మనిషి, ప్రతీ చిన్నదానాయికి హర్ట్ అయిపోతుంది.
రీసెంట్ గా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఏముందంటే ‘వదిన..మీ రీసెంట్ ఇంటర్వ్యూస్ నేను చాలానే చూసాను. మీరు ఎంత కాదని చెప్పినా, మీరు ఎప్పటికీ మా వదిన నే. ఎందుకంటే మీరు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరా నందన్ కి తల్లి. మీ ఇద్దరి వల్లనే అకిరా నందన్ బయటకు వచ్చాడు. మేము మా అన్నయ్య కొడుకు అని పిలిచినప్పుడు మీరు తప్పుగా ఫీల్ అవ్వడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి రేణు దేశాయ్ చాలా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఇలాంటి చిల్లర కామెంట్స్ ఎప్పటికీ ఆగదా’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘సంవత్సరం నుండి నేను నా ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ లో ఇలాంటి చిల్లర కామెంట్స్ వస్తున్నాయని కామెంట్స్ బాక్స్ ని ఆఫ్ లో పెట్టాను. కానీ ఇలాంటి ఇడియట్స్ నన్ను ట్యాగ్ చేసి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఆ పోస్ట్ ని షేర్ చేసి మండిపడింది. దీనిపై నెటిజెన్స్ ఎందుకు ఈమె ప్రతీ చిన్న దానిని మనసుకి తీసుకుంటుంది?, ఒక సెలబ్రిటీ అన్న తర్వాత కచ్చితంగా అభిమానించే వాళ్ళు ఉంటారు, అదే విధంగా ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. అభిమానాన్ని తీసుకున్నప్పుడు, ద్వేషాన్ని కూడా తీసుకోవాలి, పైగా అతను దారుణమైన కామెంట్స్ ట్యాగ్ చేసి ఏమి చెయ్యలేదు కదా, కేవలం తనకు అనిపించిన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు అంతే, ఇష్టం లేకపోతే పట్టించుకోకూడదు, అంతే కానీ అంత వయొలెంట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.