Israel Vs Muslim Countries: ఇప్పటికే ప్రపంచం అనేక యుద్దాలను చవిచూస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. అమెరికా తనకు గిట్టని దేశాల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. తన దారికి రాని దేశాల మీద ఆర్థికంగా ఆంక్షలు విధిస్తోంది. మొత్తంగా చూస్తే ప్రపంచంలో చాలా వరకు దేశాలు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. పశ్చిమసియాలో ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్ దేశాల మధ్య రావణ కాష్టం తగులుతూనే ఉంది.. దీనిని మర్చిపోకముందే ఇజ్రాయిల్ మరో యుద్ధానికి సిద్ధమైంది.
ఇజ్రాయిల్ దేశానికి, పాలస్తీనా దేశానికి ఎప్పటినుంచో వివాదం ఉంది. అనేక సందర్భాలలో ఈ రెండు దేశాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో బీభత్సమైన యుద్ధం కూడా జరిగింది. పాలస్తీనాకు అండగా అనేక దేశాలు రంగంలోకి దిగాయి. అయితే అన్ని దేశాలను కూడా ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇజ్రాయిల్ ను ఢీకొట్టడానికి పాలస్తీనాకు అండగా హమాస్ రంగంలోకి వచ్చింది. హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ. దీనివల్ల ఇజ్రాయిల్ తీవ్రంగానే ఇబ్బంది పడింది. ఐరన్ డోమ్ పై హమాస్ ఊహించని దాడులు కూడా చేసింది. అప్పటినుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ ఎలాగైనా సరే హమాస్ ను దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో దాడులు తీవ్రతరం చేసింది. ఇరాక్ ప్రాంతంలో దాక్కున్న హమాస్ ల స్థావరాలపై ముప్పేట దాడి చేసింది. హమాస్ కీలక నాయకుడిని అంతం చేసింది. అయితే చాలామంది ఇజ్రాయిల్ అక్కడితోనే ఆగిపోతుంది.. ఇకపై దాడులు చేయదు అనుకున్నారు. కానీ ఇజ్రాయిల్ అలా ఊరుకోలేదు. పైగా దాడులను మరింత పెంచింది.
ఈసారి ఇరాన్, ఇరాక్ కాకుండా ఏకంగా అత్యంత సంపన్న దేశమైన ఖతార్ మీద దృష్టి పెట్టింది. ఖతార్ పై దాడులు ప్రారంభించింది. ఖతార్ దేశంలో హమాస్ తీవ్రవాదులు స్థావరాలు ఏర్పరచుకున్నారని మొదటినుంచి కూడా ఇజ్రాయిల్ కు బలమైన నమ్మకం. అందువల్లే దాడులు మొదలుపెట్టింది. వాస్తవానికి హమాస్, ఇజ్రాయిల్ మధ్య సయోధ్య కుదరచడానికి ఖతార్ అనేక సందర్భాలలో మధ్యవర్తిగా వ్యవహరించింది.. ఈ వ్యవహారానికి సంబంధించి టెల్ అవీవ్ అనేక సందర్భాలలో ఖతార్ చొరవను ప్రశంసించింది. హమాస్ పై ఒకటి తీసుకురావాలా విఫలమైందని ఆరోపణలు కూడా చేసింది.
గాజా మీద యుద్ధం తర్వాత ఖతార్ లో దాడులు జరగడం ఇది రెండవసారి. ఇక ఈ ఏడాది జూన్ నెలలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో.. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై తెహరాన్ మిస్సైల్స్ దాడులు కూడా చేసింది. హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఖతార్ చేసిన దాడుల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడిలో ఎంత మంది చనిపోయారు.. ఎప్పుడు జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు అని తమ విజయవంతంగా చేసినట్టు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి కార్నల్ అవిచాయి పేర్కొన్నారు. ఇజ్రాయిల్ దాడులు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో అరబ్ దేశాలు ఒకటైనట్టు తెలుస్తోంది. ఖతార్ దేశానికి అండగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అరబ్ దేశాలు ఒక్కటై ఇజ్రాయిల్ మీద దాడికి దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దోహ వేదికగా జరిగిన ఈ సమావేశానికి దేశాలకు చెందిన అధినేతలు మొత్తం హాజరయ్యారు. ఒకవేళ ఇజ్రాయిల్ మీద అరబ్ దేశాలు యుద్ధం చేస్తే.. పశ్చిమసియాలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. దీనినిరోధానికి ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది.