https://oktelugu.com/

Renu Desai: చికిత్స లేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ మాజీ భార్య రేణుదేశాయ్.. ఆ నరకం భరించలేనంటూ..

టైగర్ నాగేశ్వరావు మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు.

Written By: , Updated On : October 15, 2023 / 10:14 AM IST
Renu Desai

Renu Desai

Follow us on

Renu Desai: నటి రేణూ దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ అభిమానుల్లో గుబులు రేపాయి. తనకు అరుదైన వ్యాధి ఉన్న విషయం చెప్పడం సంచలనమైంది. రెండు దశాబ్దాల అనంతరం రేణూ దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె సామాజిక కార్యకర్త హేమలత లవణం అనే క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీ ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది.

టైగర్ నాగేశ్వరావు మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తనకు మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అనే వ్యాధి ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధికి చికిత్స కోసం చాలా చోట్ల తిరిగాను. తాత్కాలిక చికిత్స మాత్రమే తప్ప శాశ్వత పరిష్కారం లేదని రేణూ దేశాయ్ బాంబు పేల్చింది.

ఈ వ్యాధి ఆమెను వంశపారంపర్యంగా వచ్చిందట. పుట్టుకతోనే ఉందట. ఈ వ్యాధి కారణంగా కొంచెం ఆహారం తీసుకున్నా బరువు పెరిగిపోతోందట. బీటా బ్లాకర్స్ అనే మెడిసిన్ వాడటం కూడా కారణం అంటుంది. ఈ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధపడుతున్నట్లు రేణూ దేశాయ్ చెప్పింది. బైపాస్ సర్జరీ లాంటి విధానం కూడా లేదట. కొంచెం నడిచినా అలసట, ఆయాసం, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.

అందంగా, ఆరోగ్యంగా కనిపించే రేణూ దేశాయ్ కి ఇంత భయంకరమైన వ్యాధి ఉందా అని అభిమానులు వాపోతున్నారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన రేణూ దేశాయ్ బద్రి మూవీతో హీరోయిన్ అయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చిత్ర షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని ప్రేమించి, అనంతరం వివాహం చేసుకుంది. దాంతో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. అకీరా, ఆద్య ఆమె పిల్లలు. అకీరా మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.