Site icon OkTelugu

Photo Story: ఈ ఫొటోలోని పాప (బాబు) ఇప్పుడు మెగా హీరో.. చెప్పకుండా గుర్తుపడితే మీరు గ్రేట్..

Photo Story

Photo Story

Photo Story: సోషల్ మీడియా పుణ్యామాని కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలబ్రెటీలు తమ చిన్న నాటి ఫొటోలతో అలరిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో ఈ ఫొటోలు బయటికి రావడంతో ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా ఓ పిక్ అలరిస్తోంది. ఇందులో ఒకావిడ ఓపాపను ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఆ పాపను చూసి ఆమె కూతురా? అని అనుకుంటున్నారు. లేక బంధువుల అమ్మాయా? అని చర్చించుకుంటున్నారు. ఈ పిక్ వైరల్ కావడంతో ఆరా తీయగా తేలిన అసలు విషమేంటంటే అసలు ఆమె ఆడపిల్ల కాదు అని.. ఓ అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు మెగా హీరో.. ఇంతకీ ఎవరో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలు సిని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరికి గాడ్ ఫాదర్ గా చిరింజీవి ఉంటూనే.. కొన్ని సినిమాల్లో కలిసి నటిస్తున్నారు. తాజాగా మెగా హీరోకు సంబంధించిన ఈ పిక్ అలరిస్తోంది. చిన్నప్పడు అమ్మాయి గెటప్ వేసిన ఆ హీరో ఎవరో కాదు.. సాయి ధరమ్ తేజ్.. ఈ మెగా హీరో 1986 అక్టోబర్ 15న హైదరాబాద్ లోజన్మించారు. సాయిధరమ్ తేజ్ కు మెగాస్టార్ చిరంజీవి మేనమాయ్య అవుతాడు. హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈయన 2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఫస్ట్ మూవీ సాయి ధరమ్ తేజ్ కు సక్సెస్ ను అందించింది. దీంతో అతనికి అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క వంటి సినిమాల్లో నటించారు. అయితే ఓవరాల్ గా సాయిధరమ్ తేజ్ కు హిట్ల కంటే డిజాస్టర్లే ఎక్కువగా ఉన్నాయి. అయితే 2023లో రిలీజ్ అయినా విరూపాక్ష సక్సెస్ సాధించి మరోసారి బెస్ట్ యాక్టర్ గా నిలబెట్టింది. ఇక తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

సినిమాల్లోనే కాకుండా ‘నేను మీ కల్యాణ్’ అనే కార్యక్రమంలో గెస్ట్ రోల్ చేవారు. సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అలాగే సంతోషం ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా ఆయన చిన్న నాటి పిక్ అలరిస్తంది. ఈ ఫొటోతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Exit mobile version