Renu Desai Comments On Pawan Kalyan: సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) అభిమానులు వేరే లెవెల్ లో ట్రోల్స్ వేసుకుంటున్నారు. కారణం తమిళ హీరో విజయ్ విడాకుల వ్యవహారం. కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాల్లో మహేష్ బాబు సినిమాలను రీమేక్ చేసే విజయ్, నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ ని రీమేక్ చేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పై సెటైర్లు విసిరారు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీ హీరో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇందిరా దేవి గారిని పెళ్లాడిన కొన్నాళ్ళకు విజయ్ నిర్మల ని రెండవ పెళ్లి చేసుకున్నాడని , ఆమెని పెళ్లి చేసుకున్న ఆరేళ్లకు ఇందిరా దేవి గారి నుండి మహేష్ బాబు ని సంతానం గా పొందారని , ఇలా పాత విషయాలను తవ్వడం మొదలు పెట్టారు.
Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!
అంతే కాకుండా నమ్రత శిరోడ్కర్ మహేష్ తో పెళ్ళికి ముందు ఇద్దరితో రిలేషన్ షిప్ ని మైంటైన్ చేసిందని, ఒకరితో నిశ్చితార్థం కూడా జరిగిందని, కానీ అవి నిలబడలేదని, చివరికి మహేష్ బాబు ని పెళ్లాడింది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. దీనికి కౌంటర్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రేణు దేశాయ్ గతం లో మాట్లాడిన కొన్ని వీడియోస్ ని షేర్ చేశారు . ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ రేణు దేశాయ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్ గారికి నందిని రెడ్డి తో వివాహం జరిగింది అనే విషయం మీతో ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తెలుసా లేదా ‘ అని అడగ్గా, దానికి రేణు దేశాయ్ ‘నాకు తెలియదు ‘ అంటూ సమాధానం ఇచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ఒకవేళ తెలిసినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే పరిణీతి నాకు అప్పట్లో లేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ పై నాకు ఉన్నటువంటి ప్రేమ కూడా అలాంటిదే. ఎవరేమి చెప్పినా వినపడేది కాదు . ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చెవిటిది కూడా ‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. విజయ్ విడాకుల వ్యవహారం లో ఈ ఇద్దరి హీరోల అభిమానులు పాత విషయాలను తవ్వుకొని ట్రోల్స్ చేసుకోవడం ఏంటో , మరీ అంత ఖాళీగా ఉన్నారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.